శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ అపశృతి
TeluguStop.com
తిరుపతి: శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ అపశృతి.భారీ క్రేన్ సిమెంట్ సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తున్న సమయంలో తెగిన కేబుల్స్.
సిమెంట్ సెగ్మెంట్ కింద పడి ఇద్దరు కార్మికులు మృతి.భారీ క్రేన్ సహాయంతో సిమెంట్ సెగ్మెంట్ ను లిఫ్ట్ చేసి డెడ్ బాడీ లను రుయా ఆసుపత్రికి తరలింపు.
సహాయక కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే భూమన.70-80 టన్నుల బరువున్న సిమెంట్ సెగ్మెంట్ కేబుల్ తెగి పడటంతో నుజ్జు నుజ్జు అయిన ఇద్దరు కార్మికులు డెడ్ బాడీ లు.
భూమన కరుణారరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కామెంట్స్.శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ చివరి దశలో ఈ ఘటన జరగటం చాలా బాధాకరం.
ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలను ఆదుకుంటాం.కేవలం మూడు సెగ్మెంట్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మెకానికల్ ప్రోబ్లం కారణంగా భారీ క్రేన్ కేబుల్ తెగడంతో ప్రమాదం జరిగింది.జరిగిన ఘటన చాలా బాధాకరం, 700 టన్నుల కెపాసిటీ గల భారీ క్రేన్ 70 టన్నుల సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తుండగ కేబుల్ తెగి ప్రమాదం జరిగింది.
ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగలేదు.భగవంతుడు దయ వల్ల అంతా మంచి జరిగింది అనుకున్న తరుణంలో ఈ సంఘటన బాధాకరం.
మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వము నుంచి సహకారం అందించి ఆదుకుంటాం.
మరికొద్ది రోజుల్లో ట్రైల్ రన్ నిర్వహించాలని నిర్ణయించాం, అనుకొని విధంగా ఈ ఘటన జరిగింది, చాలా బాధాకరం.
ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్ నరకయాతన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!