కచ్చా బాదం పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఇద్దరమ్మాయిలు.. వీడియో వైరల్...

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా పాటల కంటే ఒక వీధి వ్యాపారి పాడిన పాటే విపరీతంగా వైరల్ అవుతోంది.

అదే కచ్చా బాదం పాట.ఈ పాటకు యూట్యూబ్ లో 16 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

అంటే ఏ రేంజ్ లో దీనికి క్రేజ్ వస్తోందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ పాటకు సెలబ్రెటీలు కూడా స్టెప్స్ వేస్తున్నారు.

ఇక ఆడవారు కొత్త కొత్త స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.ఇందులో భాగంగా తాజాగా ఇద్దరు యువతులు అద్భుతంగా డ్యాన్స్ చేసి నెటిజన్లను కట్టిపడేసారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న వీడియోలో చుడిదార్, జీన్స్ ప్యాంట్స్ వేసుకున్న ఒక అమ్మాయి, టీషర్టు ధరించిన మరో అమ్మాయి కచ్చా బాదం పాటకు డ్యాన్స్ చేయడం చూడొచ్చు.

వీరిద్దరు వయ్యారంగా తన నడుము ఊపుతూ, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చక్కగా డాన్స్ వేశారు.

అయితే డ్యాన్స్ చేస్తున్న ఈ ఇద్దరిలో ఒకరు వీజే, సీరియల్ నటి అర్చన కాగా మరొకరు టీవీ యాక్ట్రెస్ వైషూ సుందర్.

వీరిద్దరికీ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.అలాంటి ఈ ఇద్దరమ్మాయిలు కలిసి డ్యాన్స్ వేయడంతో వీడియో వేరే లెవల్లో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 10 లక్షల లైకులు వచ్చాయి.

మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.నెటిజనులు ఈ వీడియోపై వేల కొద్ది కామెంట్లు చేస్తున్నారు.

అదిరిపోయే స్టెప్పులతో వేరే లెవెల్ లో అదరగొట్టారని పొగుడుతున్నారు ఇన్ స్టాగ్రామ్ యూజర్లు.

నైస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, క్యూట్ డ్యాన్స్ మస్త్ ఎనర్జిటిక్ గా వేశారు అని కితాబులు ఇస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

నేను పిల్లల్ని కనకపోవడానికి అసలు కారణాలివే.. వరుణ్ సందేశ్ భార్య కామెంట్స్ వైరల్!