వైరల్ వీడియో: అయ్యయ్యో.. యాక్సిలరేటర్ ఎన్ని తిప్పలు పెట్టిందో..

సోషల్ మీడియాలో నిత్యం ఏదోక వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

కొన్ని వీడియోలు నెటిజెన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటే.మరికొన్ని వీడియోలు అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఉంటాయి.

ఇలా వైరల్ అవుతున్న వీడియోలలో కొందరు వ్యక్తులు చేసే సరదా పనులు కూడా చాలా ఆనందాన్ని కలుగచేస్తాయి.

సాధారణంగా ప్రస్తుత రోజులలో షాపింగ్ మాల్స్ లలో, రైల్వే స్టేషన్స్ లో యాక్సిలరేటర్స్ వాడడం సహజమైపోయింది.

ఈ క్రమంలో కొంతమంది మహిళలు, పెద్దవారు యాక్సిలరేటర్ లను( Escalators ) ఎక్కడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అచ్చం అలాంటి సంఘటననే ఒక ఇద్దరు మహిళలు రైల్వే స్టేషన్లో( Railway Station ) యాక్సిలరేటర్ పై వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక ప్రముఖ రైల్వేస్టేషన్లో ఒక ఇద్దరు మహిళలు( Two Women ) యాక్సిలరేటర్ ను ఎక్కెందుకు చాలా భయపడిపోయారు.

ఆ భయం కారణంగా వారు యాక్సిలరేటర్ ను వెరైటీగా ఎక్కెందుకు ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో యాక్సిలరేటర్ మెట్లపై కూర్చుని రెండు చేతులను కిందికి పెట్టి పైకి వెళ్లారు వారు.

అచ్చం నాలుగు కాళ్లతో నడిచే జంతువు లాగా వారు పైకి వెళ్లడం మనం వీడియోలో చూడవచ్చు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ నుంచి భారీగానే స్పందిస్తున్నారు. """/" / ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ "చిన్నప్పుడు మాల్‌కి మొదటిసారి వెళ్ళడం నాకు గుర్తుంది.

అది నాకు కొత్త అనుభవం.మా తల్లిదండ్రులు, సోదరి యాక్సిలరేటర్‌ పై అడుగు పెట్టినప్పుడు, నా వెన్నులో వణుకు వచ్చింది.

నా తమ్ముడు వెనక్కి తిరిగి వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు" అంటూ కామెంట్ చేసాడు.

అలాగే ఈ వీడియోని చూసిన కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీ అనుభవాలని కూడా షేర్ చేయండి.

ఇండస్ట్రీలో అడుక్కున్నా కష్టమే… ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా: అర్జున్ అంబటి