పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేస్కున్న ఇద్దరు మహిళలు, ఎక్కడంటే?
TeluguStop.com
వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకునేందుకు పెద్దలను కూడా ఒప్పించారు.
సంప్రదాయ పద్దతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.మరి దీనికి ఎందుకు బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటున్నారా.
ఎందుకంటే పెళ్లి చేసుకుంది అమ్మాయి, అబ్బాయి కాదండోయ్.ఇద్దరు అమ్మాయిలు.
సుభిక్షా సుబ్రహ్మణ్యం అనే 29 ఏళ్ల మహిళ తమిళనాడులో జన్మించింది.19 ఏళ్లు వచ్చే సరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి.
ఆమె ప్రస్తుతం కెనడాలోని కాల్ గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేస్తోంది.
సుభిక్షా కొన్ని రోజులు ఖతార్ లో ఉంది.అనంతరం కెనడాకు వెళ్లి.
తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తల్లికి చెప్పింది.అదే నయం అవుతుందంటూ తల్లి ఓదార్చింది.
బంగ్లాదేశ్ కు చెందిన టనా దాస్ హిందూ కుటుంబంలో జన్మించింది.పెళ్లి చేసుకొని నాలుగేళ్ల భర్తతో కలిసి ఉంది.
ఆ తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు అని గ్రహించి భర్తను వదిలేసింది.టీనా కూడా కాల్ గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పని చేస్తోంది.
అయితే ఓ మొబైల్ యాప్ ద్వారా సుభిత్రా, టీనా దాస్ స్నేహితులు అయ్యారు.
కొన్ని రోజుల్లోనే వీరి స్నేహం ప్రేమగా మారింది.ఇదే విషయాన్ని ఆమె వాళ్ల తల్లిదండ్రులకు తెలియజేశారు.
చాలా కాలం పాటు వాళ్లు ఒప్పుకోలేదు.కానీ ఆ తర్వాత ఒప్పుకున్నారు.
దీంతో ఆగస్టు 31వ తేదీన ఇద్దరూ చెన్నైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.