శివపూజ రెండు రకాలుగా చేయొచ్చా.. వాటికి తేడా ఏంటి?
TeluguStop.com
శివ పూజ చేసే వారిలో ప్రధానంగా రెండు రకాల భక్తులు ఉంటారు.అయితే ఈ రెండు రకాల వారికి కూడా పరమేశ్వరుడి స్వరూపమైన దళాలు చాలా విలువైనవి.
శివ లింగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.ఈ మారేడు దళాలకు కూడా అంతే విలువ ఇస్తారు.
అయితే ప్రవృత్తి నివృత్తి అనే రెండు భక్తి మార్గాలలో భక్తులు శివపూజ చేస్తుంటారు.
ప్రవృత్తి మార్గాన్ని పాటించే వారు శివ లింగ పీఠాన్ని పూజిస్తారు.అలా చేయటం వల్ల వారికి సర్వ దేవతలను పూజించినంత ఫలం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.
అలాంటి భక్తులు అభిషేకం చేసి.ఆ తర్వాత నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
పూజ అయిన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేసి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్ర పరుస్తుంటారు.
నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజిస్తారంట.అలాగే భిక్షాటన చేసి వచ్చిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యంగా సమర్పిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి.
అయితే నివృతి పరులు ఓం కారాన్ని సూక్ష్మ లింగంగా భావించి ఉపాసిస్తారట.అంతే కాకుండా వీరు లింగాన్ని విభూతితో అర్చించటం, ఆ విభూతిని నైవేద్యంగా ఇవ్వటం కూడా చేస్తుంటారట.
అలాగే పూజ అయిన తర్వాత శివ లింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు.
అయితే శివరాత్రి అప్పుడు లేదా శివుడికి ఇష్టమైన రోజుల్లో ఇలాంటి పూజలు చేస్తూ.
ఆ పరమేశ్వరుడి కటాక్షం పొందాలని చూస్తుంటారు చాలా మంది భక్తులు.మనం నిత్యం పూజ చేస్తున్నా.
శివ భక్తులో ఇలాంటి వారుంటారని.ఇలా పూజలు చేస్తుంటారని మాత్రం చాలా మందికి తెలియదు.
పవన్ దమ్మున్న నాయకుడు… డిప్యూటీ సీఎం పై నటి సంచలన వ్యాఖ్యలు!