అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
TeluguStop.com
నల్గొండ జిల్లా:కొండమల్లేపల్లి మండల( Konda Mallepally ) కేంద్రంలోని చెన్నమనేని గ్రామంలో శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టాక్టర్లను కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి ( SI Rammurthy )ఆధ్వర్యంలో వెంబడించి పట్టుకున్నారు.
నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో అక్రమంగా మైనింగ్( Illegal Mining ) నిబంధనలను విరుద్ధంగా ఇసుక లోడుతో వస్తున్న టాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని,వారు ఎంతటి వారైనా ఉపేక్షించలేదని,నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేస్తే పట్టుకొని కేసులు చేసి,టాక్టర్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఆల్ ది బెస్ట్ రామ్.. నాలుగో తరం వారసుడికి విషెస్ చెప్పిన ఎన్టీఆర్?