కాంగ్రెస్ ,బీజేపీలలో రెండు టికెట్ల లొల్లి !
TeluguStop.com
ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని కాంగ్రెస్ ఉదయపూర్ డిక్లరేషన్ లో నిర్ణయం తీసుకున్నారు.
దానికి తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )నాయకులు అప్పట్లోనే అంగీకారం తెలిపారు.
ఎన్నికల సమయం దగ్గరకు రావడం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుండడం, మరికొద్ది రోజుల్లోనే జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్న నేపథ్యంలో, తమతో పాటు తమ కుటుంబంలో మరొకరికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్ సీనియర్ల నుంచి వినిపిస్తోంది.
తమ కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని ఎవరూ అడగకుండా కాంగ్రెస్ ఉదయపూర్ డిక్లరేషన్ లో నిర్ణయం తీసుకున్నా.
ఇప్పుడు ఆ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు.తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుండడం , అధికారంలోకి వస్తుందనే నమ్మకం కలుగుతుండడంతో, తమతో పాటు తమ వారసులకు టిక్కెట్ ఇప్పించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమ వారసులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండడంతో, తొలిసారి తమ వారసులను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు .
తాము రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండగానే వారసులను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనతో పాటు , తన ఇద్దరు కుమారులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు .తన ఇద్దరు కుమారులకు అసెంబ్లీ టిక్కెట్లు కోరుతున్నారు.
నాగార్జునసాగర్ , మిర్యాలగూడ తో పాటు , ఎంపీ టికెట్ కూడా అడుగుతున్నారు.
పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ( Uttamkumar Reddy )ఎప్పటి నుంచో రెండు టికెట్లు డిమాండ్ చేస్తున్నారు .
కోదాడ నుంచి తన భార్య పద్మావతి , హుజూర్ నగర్ నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఇక కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు ఆయన కుమారుడు సాయి శంకర్ నాయక్ ఇల్లందు నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
" ""/" /
ఎమ్మెల్యే సీతక్క ములుగు నుంచి , ఆయన కుమారుడు సూర్య పినపాక నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు .
అలాగే కొండ సురేఖ వరంగల్ తూర్పు నుంచి, ఆమె భర్త కొండా మురళి పరకాల నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు .
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నరసింహ, ఆయన కుమార్ త్రిష రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా తన ఇద్దరు కుమారులకు టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , ఎల్బీనగర్ నుంచి ఆయన సోదరుడు మల్ రెడ్డి రామ్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్( BRS ) నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే రేఖా నాయక్ తనకు కానాపూర్ టికెట్ తో పాటు , తన భర్త శ్యామ్ నాయక్ కు అసిఫాబాద్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) తనతో పాటు , తన కుమారుడు రోహిత్ కు టికెట్ ఇవ్వాలనే షరతుతోనే కాంగ్రెస్ లో చేరారు .
తమకు రెండు టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు ఆయన ప్రచారం చేసుకోవడంతోనే అసలు ఈ లొల్లి మొదలైందట """/" /
ఇక బిజెపి విషయానికి వస్తే, ఇక్కడ అదే పరిస్థితి కనిపిస్తుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy ) రెండు టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు.
తాను ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానని , తన భార్యకు మునుగోడు టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఈటెల రాజేందర్ సైతం తనతో పాటు తన భార్య కు టికెట్ డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా అనేకమంది నేతలు తమతో పాటు తమ వారసులకు, కుటుంబ సభ్యులకు టిక్కెట్లు డిమాండ్ చేస్తుండడంతో, ఈ రెండు పార్టీలకు ఈ వ్యవహారాలు తలనొప్పిగా.
డల్ స్కిన్ ను 20 నిమిషాల్లో సూపర్ బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీ కోసం!