ప్రగతి భవన్ లో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సీఎం లు
TeluguStop.com
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ల మధ్య సమావేశం ప్రారంభమైనట్లు తెలుస్తుంది.
ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీ ఎం జగన్ తన మంత్రుల బృందం తో కలిసి నిన్ననే అక్కడకి చేరుకున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.తెలంగాణా,ఆంధ్రప్రదేశ ల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పై జగన్,కేసీఆర్ లు చర్చించనున్నట్లు తెలుస్తుంది.
సమావేశం ఎజెండాలో సాగునీటిపారుదల, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థలు, ఢిల్లీలోని ఏపీభవన్ విభజన, విద్యుత్ సమస్య, సివిల్ సప్లై కార్పోరేషన్ రూ.
1775కోట్ల బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి అంశాలపైన కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది.సీఎంల సమావేశంలో జగన్ వెంట ఏపీ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలుశాఖల ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు మొత్తం 27 మంది సభ్యుల బృందం పాల్గొననున్నట్లు తెలుస్తుంది.
"""/"/
ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు కూడా హాజరైనట్లు సమాచారం.
అయితే ఈ సమావేశానికి కొనసాగింపుగా జూలై మూడున రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు గవర్నర్ సమక్షంలో సమావేశమై సీఎంల సమావేశంలో అంగీకారానికి వచ్చిన అంశాలపై తుదిరూపమివ్వనున్నట్లు తెలుస్తుంది.
మధుమేహం ఉన్నవారు మెంతికూర తింటే ఏం అవుతుందో తెలుసా?