భీకరంగా పోట్లాడుకున్న రెండు పాములు.. అందులో ఏది నెగ్గిందంటే
TeluguStop.com
పాములు( Snakes ) అనే పేరే చాలామందికి ఆందోళన కలిగిస్తుంది.వాటిని దగ్గర నుంచి చూస్తే ఇక అంతే సంగతులు.
అక్కడి నుంచి వెంటనే పారిపోతారు.అందులోనూ విష సర్పాలు అయితే తమ మీద పగబడతాయని ఇంకొందరు భయపడతారు.
అయితే పాములకు దూరంగా ఉండడం చాలా మంచిది.మన దేశంలో పాముకు పాలు పోసి పూజించే వారు చాలా మంది ఉన్నారు.
"""/" / పాముల్లో చాలా రకాలు ఉంటాయి.కొన్ని విషపూరితమైనవి అయితే ఇంకొన్ని విషం లేనివి.
విష సర్పాలలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి.ఏ జంతువు లేదా మనిషి అయినా అవి ఒక్క కాటు వేశాయంటే చనిపోతారు.
సాధారణంగా, భారీ పాములు తమ కడుపు నింపుకోవడానికి మానవ నివాస ప్రాంతాల చుట్టూ ఉన్న కీటకాలపై ఆధారపడతాయి.
కానీ చాలాసార్లు అవి బహిరంగంగా తమ ఆధిపత్యాన్ని చాటుకోవడం కనిపిస్తుంది.ఇటీవల, ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, ఇందులో రెండు పెద్ద పాములు నేలపై ఒకదానితో మరొకటి పోట్లాడుకున్నాయి.
"""/" /
విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే, తప్పకుండా మీరూ ఉలిక్కిపడతారు.
ఈ అద్భుతమైన వీడియో చూసి యూజర్లు కూడా షాక్ అవుతున్నారు.వీడియోలో, రెండు కోబ్రా పాములు( Two Cobra Snakes ) ఒకదానికొకటి ప్రమాదకరమైన రీతిలో పోరాడుతున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో దానిని చూసిన వారంతా ఖచ్చితంగా భయపడతారు.
ఓ పాము మెడను మరో పాము తన తోకతో చుట్టేసింది.దానిని ఉక్కిరి బిక్కిరి చేసేసింది.
అయితే ఆ పాము ఏ మాత్రం భయపడలేదు.తిరిగి తన ప్రత్యర్థి పాముపై పోరాడింది.
@india.yatra అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భయపడుతున్నారు.ఇలా పాములు రెండు ఒకదానికొకటి భీకరంగా పోట్లాడుకోవడం భయం పుట్టించిందని చాలా మంది కామెంట్లు చేశారు.
ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!