సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు.. టీ. కాంగ్రెస్ నిర్ణయం..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ సీట్ల ఎంపిక ప్రక్రియపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వనుంది.సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలను కేటాయించిన కాంగ్రెస్ సీపీఐకి కొత్తగూడెం, మునుగోడులను కేటాయించినట్లు తెలుస్తోంది.

అయితే రెండు పార్టీలకు చేరో సీటు ప్రతిపాదనను కాంగ్రెస్ తీసుకురాగా కమ్యూనిస్టులు తిరస్కరించారు.

దీంతో చెరో రెండు స్థానాలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించిందని సమాచారం.ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయంపై కమ్యూనిస్ట్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

త.