ఆ జీవి ఉమ్ము ఖరీదు కోటి 50 లక్షలు

నోట్లో ఊరే లాలాజలంకి బయట మార్కెట్లో విలువ ఉంటుందా అంటే ఉండదు అనే చాలామంది భావిస్తారు.

అయితే కొన్ని జీవులు స్రవించే లాలాజలంకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందని తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా తెలిసింది.

తాజాగా ముంబైలో రాహుల్ అనే వ్యక్తి స్పెర్మ్ వెల్స్ అనే సముద్ర జీవి లాలాజలం అమ్మడానికి ప్రయత్నించి పోలీసులకు దొరికాడు.

దీంతో ఇప్పుడు ఆ స్పెర్ వేల్స్ లాలాజలం గురించి అందరూ తెలుసుకోవడం మొదలెట్టారు.

ఇక సముద్రంలో ఉండే ఆ జీవి లాలాజలం ఖరీదు కిలో ఏకంగా కోటి 70 లక్షల అని తెలుస్తోంది.

తిమింగలాల జాతికి చెందిన స్పెర్మ్ వెల్స్ నోటి నుంచి మైనం లాంటి ఓ ద్రవాన్ని స్రవిస్తుంది.

ఈ జీవి పేగుల నుంచి ఉత్పన్నమయ్యే ఈ ద్రవపదార్థం నుంచి ఖరీదైన సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారని తెలుస్తోంది.

ఉష్ణమండల సముద్రతీరాల్లో ఎక్కువగా ఉండే ఈ తిమింగలం జాతి సముద్ర జీవులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.

అయితే రాహుల్ అనే వ్యక్తి ఆ వేల్ ద్రవపదార్థం సంపాదించి ముంబై మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించాడు.

అతన్ని పోలీసులు అరెస్టు చేయగా ఆ ద్రవ పదార్థాన్ని గుజరాత్ కి చెందిన లలిత వ్యాస్ నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పాడు.

దీనిని అతను రాహుల్ గల్ఫ్ కి చెందిన వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.

గల్ఫ్ దేశాల్లో ఈ ద్రవపదార్థంకి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దీనిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు.

ఇక ఎంబర్ గ్రీస్ అని పిలవబడే ఈ ద్రవపదార్థంని మండిస్తే కోటీశ్వరులవుతారని ఒక నమ్మకం గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉండటంతో ఈ ద్రవ పదార్ధానికి అంత డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఉమ్మడి మ్యానిఫెస్టో కి బీజేపీ దూరం అందుకేనా ? అమలు అసాధ్యమేనా ?