కొండ పైనుంచి కింద పడిన ఇద్దరు వ్యక్తులు.. షాకింగ్ వీడియో వైరల్..

అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడేవారు ఆడ్రినలిన్ రష్ అని పిలిచే ఒక రకమైన థ్రిల్‌ను అనుభూతి చెందడానికి ఘోరమైన రిస్క్‌లు చేస్తుంటారు.

తమను తాము హానికరమైన పరిస్థితులలో పడేసేందుకు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు.కొందరు వ్యక్తులు పారాగ్లైడర్‌పై గాలిలో దూసుకుపోతారు, మరికొందరు పారాచూట్ తప్ప మరేమీ లేకుండా పర్వతాల నుంచి దూకుతారు.

ఇంకొందరు చిన్న పడవలో సముద్రంలో ప్రయాణించి, అలలకు ఎదురుగా వెళ్లి డెడ్లీ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు.

ఈ సాహస క్రీడలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో అడపాదడపా వైరల్‌గా మారుతుంటాయి.

ప్రస్తుతం అలాంటి మరొక వీడియో వైరల్ గా మారింది.ఈ హార్ట్ స్టాపింగ్ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు జలపాతంలో రాఫ్టింగ్ చేశారు.@MindExpanding1 అనే హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను ట్విట్టర్‌( Twitter )లో షేర్ చేశారు.

ఇందులో కొండపై నుంచి జాలువారుతున్న జలపాతంతో వేగంగా ప్రవహించే నది కనిపించింది.రెండు వేర్వేరు పడవలలో ఇద్దరు వ్యక్తులు నదిలో రాఫ్టింగ్ చేస్తుండటం కూడా కనిపించింది.

తరువాత వారు జలపాతం వద్దకు చేరుకుని, చాలా అడుగుల లోతులో ఉన్న నీటిలోకి దూకుతారు.

కొన్ని క్షణాల తర్వాత, వారు సురక్షితంగా బయటపడతారు. """/" / ఆ జలపాతం చాలా ఉధృతంగా నీటిని కిందకు నెడుతోంది.

అందులో పడితే చనిపోవడం ఖాయం అనేలా భయపెడుతోంది.అయినా ఈ ఇద్దరు మాత్రం చాలా సింపుల్‌గా డేరింగ్ స్టంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

నిజానికి ఈ పద్ధతిలో రాఫ్టింగ్ చేయడానికి చాలా నైపుణ్యం, ధైర్యం అవసరం.ఈ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంది.

"వారు దాని నుంచి బయటపడ్డారని నేను నమ్మలేకపోతున్నాను!", " వందేళ్లు ప్రాక్టీస్ చేసినా నేను అలా చేయలేను!" అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

"""/" / ఈ వీడియో అడ్వెంచర్ స్పోర్ట్స్( Adventure Sports ) ప్రమాదాల గురించి కూడా చర్చకు దారితీసింది.

కొంతమంది ఈ క్రీడలు చాలా ప్రమాదకరమైనవి, వీటిని చేయకుండా నిషేధించాలని కామెంట్స్ పెట్టారు.

మరికొందరు అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది వ్యక్తిగత నిర్ణయమని, ప్రజలు రిస్క్ తీసుకోవడానికి స్వేచ్ఛని ఇవ్వాలని పేర్కొన్నారు.

ఏది ఏమైనా కొంచెం తేడా వచ్చిన ఈ ఆటలలో ప్రాణాలు పోయాడు ప్రమాదం చాలా ఎక్కువ.

ఫైర్ బ్రాండ్ బ్యూటీ రాశి ఖన్నా రెడ్ హాట్ అవుట్ ఫిట్స్