ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటే..?

పెళ్లి అంటే మనకు తెలిసి ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి చేసుకునేది.

కానీ కాలం మారుతుంది.పెళ్లిళ్లు అంటే ఆడ మగ మాత్రమే చేసుకునేది కాదు.

ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలు కూడా చేసుకోవచ్చు అని దేశంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా అర్ధం అవుతుంది.

ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, ఇద్దరూ స్త్రీలు పెళ్లి చేసుకుని ఒక్కటి అవ్వడం అనేది పూర్తిగా వాళ్ళ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది.

ఈ క్రమం లోనే ఇద్దరూ పురుషులు కూడా తమ ఇష్టానుసారంగా పెళ్లి అనే బంధంతో ఒక్కటి అవ్వబోతున్నారు.

ఈ ఘటన ఎక్కడో విదేశాలలో జరగలేదండోయ్.తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

ఈ ఇద్దరు పురుషులు కూడా స్వలింగ సంపర్కులు అవ్వడంతో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.

అసలు వివరాల్లోకి వెళితే.హైదరాబాద్ కు చెందిన సుప్రియో, అభయ్ అనే ఇద్దరు స్వలింగ సంపర్కుల ఇలా పెళ్లి అనే బంధంతో ఒక్కటి అవ్వబోతున్నారు.

వీరు ఎలా కలిసారో తెలిస్తే షాక్ అవుతారు.వీరిద్దరిని కలిపింది ఒక డేటింగ్ యాప్.

ఆ యాప్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అలా ఎనిమిదేళ్ల పాటు వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. """/"/ అలాఎనిమిదేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

వాళ్ళ పెళ్ళికి తమ తల్లి దండ్రులను కూడా నచ్చ చెప్పి ఒప్పించారు.పెళ్లికి ఇరు వర్గాల పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి పనులు ప్రారంభించేసారు.

అంతేకాకుండా వీరివురి పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా జరగునన్నుట్లు తెలుస్తుంది.అన్ని కార్యక్రమాలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయని వారు చెబుతున్నారు.

వీరి పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాటేసిన పామును ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకొచ్చి ఆస్పత్రిలో గందరగోళాన్ని సృష్టించిన యువకుడు..