పార్ట్ టైం జాబ్ లింక్స్ తో జాగ్రత్త.. సైబర్ వలలో చిక్కిన ఇద్దరు యువకులు..!
TeluguStop.com
ప్రస్తుతం నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో.చాలామంది యువత పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఏ జాబ్ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు.
ఈ క్రమంలో ఆన్లైన్ లో వచ్చే పార్ట్ టైం జాబ్ లింక్స్ పై( Part Time Job Links ) క్లిక్ చేసి సైబర్ వలలో చిక్కుతున్నారు.
తెలంగాణలోని సంగారెడ్డిలో( Sangareddy ) ఇద్దరు యువకులు పార్ట్ టైం జాబ్ లింక్ పై క్లిక్ చేసి సైబర్ వలలో చిక్కారు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.అమీన్ పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
అమీన్ పూర్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి నవంబర్ 4న పార్ట్ టైం జాబ్( Part Time Job ) పేరుతో ఒక లింక్ వచ్చింది.
ఆ లింక్ క్లిక్ చేసి, అపరిచిత వ్యక్తి చెప్పిన నగదులను చెల్లిస్తూ, ఇచ్చిన టాస్కులు ( Tasks ) పూర్తి చేస్తూ వచ్చాడు.
వాలెట్ లో వ్యక్తి పెట్టిన నగదు, కమిషన్లు ( Commission ) క్రియేట్ చేసి చూపిస్తు ఉండడంతో పూర్తిగా నమ్మేసిన వ్యక్తి ఏకంగా రూ.
7.48 లక్షల డబ్బులు చెల్లించాడు.
ఆ తర్వాత అపరిచిత వ్యక్తి స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, """/" /
ఆ తర్వాత సోమవారం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో( Aminpur Police Station ) ఫిర్యాదు చేశాడు.
మరో బాధిత వ్యక్తి విషయానికి వస్తే.అమీన్ పూర్ పరిధిలోని బంధన్ కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీలో నివాసం ఉండేవో వ్యక్తికి నవంబర్ 2న పార్ట్ టైం జాబ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ ను ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేసి, అపరిచిత వ్యక్తి చెప్పిన నగదును పెడుతూ చెప్పిన టాస్కులు పూర్తి చేశాడు.
"""/" /
ఈ క్రమంలో ఆ వ్యక్తి మొత్తం 3.55 లక్షల రూపాయలను అపరచిత వ్యక్తి చెప్పినట్లు చెల్లించాడు.
ఆ తర్వాత అపరిచిత వ్యక్తి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో.బాధిత వ్యక్తి తాను పెట్టిన నగదు తో పాటు కమిషన్ ఇవ్వాలని కోరాడు.
అపరిచిత వ్యక్తి స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత వ్యక్తి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, సోమవారం అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇలాంటి పాత్రల్లో అద్భుతంగా నటించడం ఎన్టీఆర్ కే సాధ్యం.. ఏం జరిగిందంటే?