కెనడాలో ఎన్నారైలకు షాక్.. కుల వివక్ష చూపినందుకు భారీ ఫైన్!

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా( British Columbia )లో ఎన్నారైలకు షాక్ తగిలింది.హ్యూమన్ రైట్స్ ట్రిబ్యునల్ వ్యాపార భాగస్వామి అయిన మనోజ్ భంగుపై కుల వివక్షకు పాల్పడినందుకు ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులకు భారీ ఫైన్ విధించడం జరిగింది.

ఆ ఎన్నారైల పేర్లు ఇందర్‌జిత్, అవనీందర్ ధిల్లాన్‌ కాగా వారికి హ్యూమన్ రైట్స్ ట్రిబ్యునల్ అధికారులు( Human Rights Tribunal Officials ) దాదాపు పది వేల కెనడియన్ డాలర్ల జరిమానా విధించారు.

2018లో, ధిల్లాన్‌ రెండు వేర్వేరు సంఘటనల సందర్భంగా మనోజ్‌పై సాధారణంగా భారతదేశంలోని దళిత సమాజానికి వ్యతిరేకంగా ఉపయోగించే పంజాబీ దూషణకు పాల్పడ్డారు.

"""/"/ బోర్డ్‌రూమ్ సమావేశంలో బాధితుడు, నిందితుల మధ్య మొదటి వాగ్వాదం జరిగింది.ఆడియో రికార్డింగ్‌లో కుల దూషణలు( Castiest Slur ) వినిపించాయి.

కానీ న్యాయస్థానం ఈ రికార్డింగ్స్ లో స్పష్టత లేదు అని దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

అయితే, ఒక క్రిస్మస్ పార్టీలో జరిగిన రెండవ వాగ్వాదంలో ఇందర్‌జిత్( Inderjit ), అవనీందర్( Avninder Dhillon ) మనోజ్‌ని కొడుతూ, పదేపదే దూషించారు.

ఈ వివక్ష స్వల్పకాలికం, కానీ అది హింసతో కూడుకున్నది.సాక్షులు ఈ వ్యవహారాన్ని చూసినట్లు న్యాయస్థానంలో తెలిపారు.

దాంతో కోర్టు ఆ ఇద్దరు ఎన్నారైలపై చర్య తీసుకునేందుకు సిద్ధమైంది.భారతదేశం( India )లోనే కాకుండా ఇక్కడ కూడా కుల వివక్షకు గురైన భంగు చూసి సానుభూతి వ్యక్తం చేసింది.

అతను చాలా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారని ధర్మాసనం పేర్కొంది. """/"/ న్యాయనిర్ణేత సోనియా పిగిహ్న్( Tribunal Adjucator Sonya Pigihn ) భంగుపై వివక్ష ప్రభావం నష్టపరిహారాన్ని అర్హమైనదిగా గుర్తించారు.

కేసును న్యాయస్థానంలో పెట్టడానికి అతను చేసిన ఖర్చులు $37.55.

81తో పాటు $6,000 (దాదాపు రూ.3 లక్షల 60 వేలు) చెల్లించాలని ఇందర్‌జిత్, అవనీందర్ ధిల్లాన్‌లను ఆదేశించింది.

దాంతో వారు తాము చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!