రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దుర్మరణం.. సాయం కోరుతోన్న కుటుంబసభ్యులు

గత వారం ఆస్ట్రేలియాలో( Australia ) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

యద్వీందర్ సింగ్ భట్టి, పంకజ్ సియాగ్‌లు ( Yadvinder Singh Bhatti , Pankaj Siag )ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

వారు ప్రయాణిస్తున్న ట్రక్కు.మెల్‌బోర్న్ నుంచి పెర్త్‌కు లోడ్‌ను తీసుకుని వెళ్తోంది.

77 ఏళ్ల నెవిల్లే ముగ్రిడ్జ్( Neville Mugridge ) నడుపుతోన్న భారీ కంటైనర్‌ను వీరి ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

వీరి మరణవార్త తెలుసుకున్న భట్టి, సియాగ్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

భట్టి భార్య రమణదీప్ తన భర్త అంత్యక్రియల కోసం ‘‘ GoFundMe Page ’’లో విరాళాలు సేకరిస్తున్నారు.

"""/" / ఇకపోతే.ఇటీవలే పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల సియాగ్ ( Siag )తన భార్యతో కలిసి ఆస్ట్రేలియలో నివసిస్తున్నాడు.

ప్రమాదంలో అన్నయ్యను పొగొట్టుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారని తమ్ముడు జన్‌దీప్ ఆవేదన వ్యక్తం చేశారు.

జన్‌దీప్ ‘ GoFundMe Page ’’ ద్వారా పంకజ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.

ఆస్ట్రేలియాలో ఒంటరిగా వున్న అతని భార్య దేశం కానీ దేశంలో ఎవరి మద్ధతు లేకుండా ఊహించలేని నష్టాన్ని ఎదుర్కొంటోందని జన్‌దీప్ రాశారు.

పంకజ్ భౌతికకాయాన్ని ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి రవాణా చేయడానికి ఖర్చుల కోసం తమకు సాయం చేయాల్సిందిగా జన్‌దీప్ విజ్ఞప్తి చేశారు.

"""/" / కాగా.గత నెలలో లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధిని దుర్మరణం పాలైంది.

నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్( Former CEO Of NITI Aayog, Amitabh Kant ) సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.

లండన్‌లో తన అపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్తుండగా ట్రక్కు ఢీకొని ఆమె ప్రాణాలు కోల్పోయింది.

33 ఏళ్ల చీస్తా కొచ్చర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో (ఎల్‌ఎస్ఈ) పీహెచ్‌డీ అభ్యసిస్తున్నారు.

ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ .గతంలో పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ నీతి అయోగ్‌తో కలిసి పనిచేసిన చీస్తా కొచ్చర్ .

ఎల్ఎస్ఈ నుంచి బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ అభ్యస్ధిస్తున్నారు.నీతి ఆయోగ్‌లోని లైఫ్ ప్రోగ్రామ్‌లో చీస్తా కొచ్చర్ తనతో కలిసి పనిచేశారని అమితాబ్ కాంత్ తన ఎక్స్‌ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

లండన్‌లో సైక్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.కానీ ఆమె ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని ఆయన పేర్కొన్నారు.

వామ్మో, కదులుతున్న రైలుపై డ్యాన్స్ చేసిన యువతి.. చివరికి ఏమైందో చూస్తే..