ఆనందయ్య ఆయుర్వేదం పై దాఖాలైన రెండు హౌస్ మోషన్ పిటిషన్లు.. హైకోర్టు తీర్పు ఏంటో.. ?
TeluguStop.com
కృష్ణపట్నం ఆనందయ్య అనే పేరు తెలియని వారు ప్రస్తుత పరిస్దితుల్లో ఎవరు లేరు.
ఆయుర్వేదానికి ఆయువునిచ్చి, వివాదానికి కేంద్ర బిందువులా మారాడు.కరోనా పేషెంట్స్ కోసం ఈయన తయారు చేసిన మందు ఒక్క సారిగా ఆనందయ్యను అందనంత దూరం తీసుకెళ్లింది.
ప్రస్తుతం ఈయన ఆయుర్వేద మందు పై పలు వివాదాలు ముసరగా, ఇదే స్దాయిలో సోషల్ మీడియా లో ఆనందయ్యకు మద్దతు లభిస్తుంది.
అంతే కాదు కరోనా మందు కోసం న్యాయపోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి ఆనందయ్య తయారు చేసిన కోవిడ్ మందు పంపిణీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారట.
మరోవైపు ఈ కరోనా మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
ఇలా రెండు హౌస్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో అని ప్రజలందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.
ఇక ఇప్పటికే ఈ కరోనా మందు పై ఆయుష్ కమిషనర్ రాములు తయారు చేసిన నివేదికను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు అందజేసిన విషయం తెలిసిందే.
అయినా లక్షల ప్రాణాలు తీసిన ఆస్పత్రుల పై లేని హైరాన ప్రజలను బ్రతికించే మందు తయారు చేస్తే చూపించడం విచారకరం అని అంటున్నారట చాలమంది ప్రజలు.