అమ్మాయిలతో నగ్నంగా క్షుద్ర పూజలు.. ఆపై అత్యాచారం..!
TeluguStop.com
ఒక వైపు ప్రపంచం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంటే.మరొకవైపు మూఢనమ్మకాలతో కొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
కొందరు వ్యక్తులు మూఢనమ్మకాల పేరుతో యువతులను టార్గెట్ చేసి వారితో నగ్నంగా క్షుద్ర పూజలు చేపించి, అపై అత్యాచారానికి పాల్పడ్డారు.
తాజాగా ఈ సంఘటన ఆదివారం గుంటూరు జిల్లాలో ( Guntur ) స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.ఆదివారం గుంటూరు లో డీఎస్పీ మహబూబ్ బాషా మీడియా ముందు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ప్రకారం.
తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు( Pujari Nageswara Rao ) పూజలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
చిలకలూరిపేటకు చెందిన అరవింద( Aravinda ) అనే మహిళ పలు రకాల వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయింది.
పూజారి నాగేశ్వరరావుకు, అరవింద కు సామాజిక మధ్యమాల ద్వారా పరిచయం ఏర్పడింది.కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలంటే గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేయాలని నాగేశ్వరరావు, అరవింద తో చెప్పాడు.
దీంతో అరవింద, నాగేశ్వరరావు క్షుద్ర పూజల కోసం యువతులు కావాలని.ఆ యువతులు నగ్నంగా పూజలో కూర్చుంటే రూ.
లక్ష రూపాయలు ఇస్తామని నాగేంద్ర అనే వ్యక్తికి చెప్పారు.నాగేంద్ర తన స్నేహితుడైన సురేష్ తో కలిసి నంద్యాల జిల్లాలో ఉండే పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులకు డబ్బు ఆశ చూపించి ఒప్పించారు.
"""/" /
అరవింద ఆ ఇద్దరూ యువతులను నాగేశ్వరరావు దగ్గరికి తీసుకువెళ్తే, ఆ యువతులతో నగ్నంగా క్షుద్ర పూజలు చేయించాడు.
పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నాగేశ్వరరావు, ఆతని అనుచరులు ఆ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ యువతులు ఎదురు తిరగడంతో ఆ యువతులను చంపేస్తామంటూ బెదిరించి శనివారం ఆ యువతులను ఓ కారులో ఎక్కించి గుంటూరు వైపు బయలుదేరారు.
"""/" /
గోరంట్ల సమీపంలో కారులో నుండి తప్పించుకున్న యువతులు దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పూజారి నాగేశ్వరరావు తో పాటు నాగేంద్ర బాబు (పొన్నేకల్లు), అరవింద, రాధా ( చిలకలూరిపేట), సురేష్ (గుంటూరు), పెద్దిరెడ్డి, భాస్కర్, పవన్, సుబ్బులు, సునీల్, సాగర్, శివ (నంద్యాల) అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కొరియన్ మరదలికి ఆలూ పూరీ టేస్ట్ చూపించిన ఇండియన్.. రియాక్షన్ వైరల్!