ప్రజావాణిలో రెండు కుటుంబాలు ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా:జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది.

అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోని,పెట్రోల్ బాటిళ్లు లాక్కోవడంతో ప్రమాదం తప్పింది.బాధితుల కథనం ప్రకారం.

గరిడేపల్లి మండలం కల్మలచెర్వు గ్రామానికి చెందిన మీసాల జానయ్యకు అతని సోదరునికి మధ్య నెలకొన్న భూ వివాదంలో కోర్టు తీర్పు జానయ్యకు అనుకూలంగా వచ్చింది.

అయినా భూమి మీదికి వెళ్లకుండా సోదరుడు అడ్డుకుంటున్నారని,న్యాయం చేయమని ఎస్ఐ కొండల్ రెడ్డికి ఫిర్యాదు చేయగా రూ.

లక్ష లంచం ఇవ్వాలంటూ వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో జానయ్య,భార్య అన్నపూర్ణ,కూతురు స్వాతి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణికి హాజరై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

వీరితో పాటు అదే గ్రామానికి చెందిన పున్న వీరమ్మ,ఆమె కుమారుడు సైదులు తమ భూమిని వేరే వాళ్ళు అక్రమించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

రెండు కుటుంబాలు ఎస్ఐ బాధితులు కావడం గమనార్హం.ఈ విషయమై గరిడేపల్లి ఎస్ఐ కొండల్ రెడ్డిని వివరణ కోరగా కావాలనే వారు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని,వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించవచ్చని అన్నారు.

సౌత్ ఆఫ్రికన్ బిర్యానీ ఇండియన్ బిర్యానీ కంటే రుచిగా ఉంటుందా..?