మందేసి చిందేశారు.. కొట్టుకుంటూ వెరైటీగా చేసిన డ్యాన్స్
TeluguStop.com
చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉంటోంది.ఏదైనా పార్టీలోనో, పెళ్లి ఫంక్షన్‌లోనో మందు తాగుతుంటారు.
ఇక పెళ్లైన వాళ్లు భార్యలకు, పెళ్లి కాని యువకులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా వారాంతాల్లో కొంచెం మందు తాగుతుంటారు.
ఒకటి రెండు బీర్లు తాగి ఇంటికి చేరుతుంటారు.ఇక అదేపనిగా ఎక్కువ మొత్తంలో మందు తాగే వారు కూడా ఉంటారు.
ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు.కొందరైతే ఏదైనా మ్యూజిక్ పెట్టినా, తీన్మార్ కొట్టినా డ్యాన్స్ చేస్తారు.
చిత్ర విచిత్రంగా వారు వేసే స్టెప్పులు అక్కడి వారిని అలరిస్తాయి.తాజాగా ఇదే తరహాలో కొందరు యువకులు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.మందు తాగగానే కొంత మందికి నిషా ఎక్కుతుంది.
కొందరికి ఎంత తాగినా ఎక్కదు.ఇక ఏ మాత్రం మత్తెక్కినా కొందరు చేసే వింత ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా కొందరు యువకులు మద్యం మత్తులో వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫుల్లుగా తాగేసిన యువకులు కింద పడి మరీ డ్యాన్స్ చేశారు.మరలా పైకి లేచి, తూలుతూ స్టెప్పులు వేశారు.
అకస్మాత్తుగా మధ్యలో వారు వేసే స్టెప్పులు వేసేశారు.అందులో ఒకరు మరొకరిని కొడతారు.
కాలితో తన్నుతాడు.తర్వాత మరొకడు అవతలి వ్యక్తిని కొట్టి, చెంపపై ఒక్కటిస్తాడు.
"""/"/
అంతలోనే తనను కొడుతుంటే మరొకడు తప్పించుకుంటాడు.ఇలా చిత్ర విచిత్రమైన స్టెప్పులతో వారు అలరించారు.
దీనిని బావాసీర్‌పోస్టింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.
దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇలాంటి వెరైటీ డ్యాన్స్ తాము ఎక్కడా చూడలేదని పేర్కొంటున్నారు.
ఈ డ్యాన్స్ చాలా బాగుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.అసలు ఇద్దరూ తాగి ఊగారా? లేక తాగినట్లు యాక్టింగ్ చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు.
ఏదేమైనా ఇద్దరూ తమ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
13 ఏళ్లకే సన్యాసినిగా మారిన బాలిక.. కుంభమేళాలో ఈ ఘటనపై మీరేమంటారు..