ఇది కారా? లేక గూడ్స్ రైలా? (వీడియో)
TeluguStop.com
నిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్( Viral Video ) అవుతూనే ఉంటాయి.
కొన్ని వీడియోలు అందర్నీ ఆకట్టుకుంటే.మరికొందరికి ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయని ఆలోచింప చేసే విధంగా ఉంటాయి.
అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకుంటే బైక్, కార్, బస్ ద్వారా గమ్యానికి చేరుకుంటూ ఉంటారు.
ఇక కొంతమంది బైకుపై ముగ్గురూ లేదా నలుగురు వెళ్లే వారు ఉన్నారు.ఇక కొంత మంది ఏదైనా వస్తువులను రవాణా చేసే కొరకు వివిధ రకాల వాహనాలను వాడుతూ ఉంటారు.
"""/" /
కానీ, తాజాగా ఒక వ్యక్తి తన కారును ఏకంగా ట్రాన్స్ పోర్ట్ వెహికల్ లాగా మార్చిన తీరును చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక చిన్న కారులో భారీ లగేజ్ ను తీసుకెళ్తున్నట్లు మనం చూడవచ్చు.
సాధారణంగా మారుతి 800( Maruti-800 ) కారులో నలుగురు లేదా ఐదుగురు నుంచి ప్రయాణించడం చాలా కష్టం.
అలాగే ఇందులో లగేజ్ కూడా కొంత మోతాదులోనే తీసుకొని వెళ్లొచ్చు. """/" /
కానీ తాజాగా ఆ చిన్న కారును లగేజ్ ట్రక్కులాగా మార్చేసి.
ఆ కారుపై ఏకంగా 24 భారీ డ్రమ్ములను( 24 Huge Drums ) తాడుతో కట్టి చాలా సులువుగా తీసుకొని వెళ్తున్నాడు.
రోడ్డుపై వెళ్తున్న ఈ వాహనాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవడంతో పాటు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
వీడియో చూసిన నెటిజన్స్ స్పందిస్తూ.వీరు ఇంత పెద్ద లగేజ్ను కారులో తీసుకొని వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు., ఇలాంటి ఐడియాలు మన ఇండియాలోనే సాధ్యమవుతాయి అంటూ కామెంట్స్ చేశారు.
వెండి పాత్రలను చిటికెలో మెరిపించే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు మీకోసం!