వైరల్: ఐశ్యర్య రాయ్ పాటకి లెహంగా వేసుకొని మరీ డాన్సులు ఇరగదీసిన అబ్బాయిలు!

సరిగా 2 దశాబ్దాల క్రితం బాలీవుడ్లో విడుదలైన 'దేవదాసు' సినిమా గుర్తుందా? మర్చి పోవడం అంత తేలిక కాదు కదా.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా ఐశ్వర్య, మాధురి దీక్షిత్ నటించిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు తిరగ రాసింది.

ఇక అందులోని పాటలైతే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి.ఎంతంటే నార్త్ లో వున్న ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లలో ఈ సినిమా పాటలు ఖచ్చితంగా స్టోర్ అయ్యే ఉంటాయి.

ఒక్క నార్త్ మాత్రమే కాకుండా సౌత్ లో కూడా ఈ సినిమా పాటలు దుమ్ము దులిపాయి.

ఇక అదంతా ఒకెత్తయితే ఈ సినిమాలో ముఖ్యంగా ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ కాంబోలో “డోలా రే డోలా” పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

క్లాసికల్ కల్ట్ తో వచ్చిన ఈ పాటలో ఇద్దరి డాన్స్ చూస్తే అభిమానులకు పూనకాలు వస్తాయి.

కాగా ఈ పాట ఇపుడు ఖండాతరాలు దాటి న్యూయార్క్ వీధుల్లో అలరిస్తోంది.అదేనండి అక్కడ ఒక భారతీయుడు, కెనడియన్ వ్యక్తులు కలిసి డోలారే డోలా రే.

పాటకు అదిరిపోయే నృత్యం చేయగా ఈ డాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"""/"/ వారి డాన్సుని చూసి నెటిజన్లు అయితే కుళ్ళుకుంటున్నారు.ఎందుకంటే ఇదొక లేడీ ఓరియెంటెడ్ సాంగ్.

అయినా వారిని గుర్తుకు తెచ్చేలా వీరిద్దరూ వేసిన స్టెప్స్ అదుర్స్ అని చెప్పుకోవాలి.

అవును.వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఇండియాకు చెందిన జైనిల్ మెహతా, కెనడాకు చెందిన అలెక్స్ వాంగ్ లెహంగాలు ధరించి మరీ దేవదాస్ పాటకు డ్యాన్స్ చేయడం ఒకింత విడ్డురమే అని చెప్పుకోవాలి.

విదేశాలలో ప్రదర్శించిన ఈ అద్భుతమైన భారతీయ నృత్యాన్ని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు తన్మయత్వం చెందుతున్నారు.

మహిళను 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఆంబులెన్స్ డ్రైవర్.. ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!