హైట్ తక్కువేమో.. కానీ గుండెలనిండా ధైర్యం ఉంది.. దొంగలకు చుక్కలు చూపించిన దంపతులు!

ధైర్యానికి శరీరాకృతితో సంబంధం లేదు.తెగువకు హైట్ తో పని లేదు.

సాహసానికి మనో ధైర్యం ఉంటే చాలు.ఇంకేదీ అవసరం లేదు.

దానినే నిరూపించారు ఈ బిహార్ దంపతులు.వాళ్లు ఉండేది కేవలం రెండున్నర అడుగులే.

కానీ తెగువకు మాత్రం పరిమితి లేదు.వారు చూపిన ధైర్య సాహసాలు ఇప్పుడు అందరి మన్ననలను అందుకుంటోంది.

ఇంట్లోకి చోరికి వచ్చిన దొంగలకు చుక్కలు చూపించారు.అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం ఇది చదవాల్సిందే.

బిహార్ బక్సర్ జిల్లాలో నివసిస్తున్నారు ఈ మరగుజ్జు దంపతులు.దంపతులిద్దరీ హైట్ చాలా తక్కువ.

వారు ఉండేది కేవలం రెండున్నర అడుగులే.వీరి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు.

చిన్నగా ఉన్నారు.వారు మనల్ని ఏం చేస్తారులే అనుకొని ఉంటారు ఆ దొంగలు.

కానీ వారి అంచనాలు తలకిందులు చేశారు ఆ దంపతులు.ఇంట్లోకి చొరబడ్డ దొంగలను ధైర్యంగా అడ్డుకున్నారు.

అనంతరం ఓ దొంగను కూడా పట్టుకున్నారు.కృష్ణ బ్రహ్మ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

పట్టుబడిన దొంగ ఎత్తు ఐదు అడుగుల కన్నా ఎక్కువే.దొంగను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు దంపతులు.

వారు అక్కడికి వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు.అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

దొంగలను చూసి బెదరకుండా ధైర్యంగా వారిని అడ్డుకున్న తీరు ఇప్పుడు అందరి మన్ననలను అందుకుంటోంది.

మరగుజ్జు దంపతులకు ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.