రూ.11 లక్షల విలువైన గుట్కా సీజ్ ఇద్దరు నిందితులు అరెస్టు…!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో బ్రేకరీ బిజినెస్( Bakery Business ) మాటున గుట్టుగా గుట్కా దందా చేస్తున్నారని వివిధ పత్రికల్లో,మీడియాలో వచ్చిన కథనాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ( SP Sunpreet Singh )సిరియస్ గా తీసుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు.

జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో పొగాకు ఉత్పత్తులు గుర్తించిన పట్టణ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు ముఠా గుట్టు రట్టయింది.

జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.మార్కెట్ రోడ్డులో గల మణి బేకరీ కేంద్రం నిర్వాహకుడు శివసత్తి అక్రమంగా నిషేధిత గుట్కా,ఇతర పొగాకు ఉత్పత్తులను కర్ణాటక రాష్ట్రం నుండి సూర్యాపేటకు తరలించి ఒక దగ్గర డంప్ చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు అదుపులోకి తీసుకున్న నిందితులు చెప్పడంతో రూ.

11 లక్షల విలువగల గుట్కా,ఖైని,పాన్ మసాల సహా రెండు మినీ వ్యాన్లు సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లడుతూ ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గుట్కా,పాన్ మసాలా, గంజాయి లాంటి మత్తు పదార్ధాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైరల్ వీడియో: ఎంతకు తెగించార్ర బాబు.. భోజనాల కోసం ఏకంగా..