నకిలీ వార్తలను ఆపేందుకు ట్విట్టర్ సరికొత్త ఆప్షన్..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది.ఈ సోషల్ మీడియా కారణంగా నిజమైన వార్తల ప్రచారం కంటే అసత్య వార్తల ప్రచారం ఎక్కువగా కొనసాగుతోంది.

వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం, అలాగే సోషల్ వెబ్ సైట్స్ ఎన్ని ప్రయత్నాలు చేసిన వీటికి చెక్ పెట్టడానికి చాలా సమయం పడుతోంది.

ఇందుకోసం ఒక్కో సోషల్ మీడియా సంస్థ ఒక్కోరకంగా వారి యూజర్స్ ను హెచ్చరిస్తూనే ఉంది.

ఇందులో భాగంగానే ఫేస్బుక్ లో ఎవరైనా అసత్య ప్రచారాలను ప్రసారం చేస్తే వారికి వార్నింగ్ లేబుళ్లు ఇస్తుండగా.

తాజాగా ట్విట్టర్ కూడా ఇలాంటి వ్యవహారాన్ని తీసుకువచ్చింది.ఇందులో భాగంగానే ట్విట్టర్ డిస్ప్యూటెడ్ ట్వీట్ పేరుతో వారి యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా లేదా కల్పితమైన వార్తలకు సంబంధించి వార్నింగ్ లేబుల్ ఇచ్చినప్పటికీ చాలా మంది యూజర్స్ అవగాహన లేమితో కొందరు వాటిని నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరి కొందరు అవి అసత్యాలని తెలియకుండా వాటిని రిపోస్ట్ లేదా రిట్వీట్ లాంటివి చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.దీంతో తాజాగా ట్విట్టర్ ఈ సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

ఇకపై ఎవరైనా ట్విట్టర్ యూజర్ డిస్ప్యూటెడ్ ట్వీట్ లేదా ఏదైనా హెచ్చరికలు జారీ చేసిన దానిని లైక్ లేదా షేర్ ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే అందుకు సంబంధించి పాపప్ విండో ఓపెన్ అవుతుంది.

ఆ విండోలో ఇది డిస్ప్యూటెడ్ అని నమ్మకమైన సమాచారం అందించే వేదికగా ట్విట్టర్ ఉంచేందుకు సహాయపడండి అంటూ ట్వీట్ చేసే ముందు దాని గురించి మంచి సమాచారం తెలుసుకోండి అంటూ పాపప్ బాక్సులో సమాచారం అందజేయబడుతుంది.

తాజాగా దీనిపై పరిశోధనలు జరిపిన సమయంలో మంచి ఫలితాలు వచ్చాయని, అందుకు సంబంధించి ఏకంగా 29 శాతం మేర అసత్య ప్రచారాలు వెలుగులోకి రావట్లేదని ట్విట్టర్ తెలుపుతోంది.

ముఖ్యంగా ప్రస్తుతం కరోనా వైరస్ పై కొన్ని పుకార్లు వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ట్విట్టర్ తన అభిప్రాయాన్ని తెలిపింది.

రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ ఎక్కిన కౌశిక్.. ఇతని సక్సెస్ కు వావ్ అనాల్సిందే!