ట్రోలర్స్ నుండి తప్పించుకునేలా ట్విట్టర్ సర్కిల్..!
TeluguStop.com
ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో ట్విట్టర్ లో ట్రోలర్స్ బెడద నుండి తప్పించుకోవడానికి తమ ట్వీట్స్ ని కేవలం తమకు ఇష్టం ఉన్న వారితో మాత్రమే పంచుకునేలా ట్విట్టర్ సర్కిల్ అనే కొత్త ఫీచర్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ట్విట్టర్ సర్కిల్ ద్వారా తమ ట్వీట్స్ కేవలం సెలెక్ట్ చేసిన వ్యక్తులకు మాత్రమే కబడుతుంది.
ట్విట్టర్ సర్కిల్ లో తాము ఫాలో అయ్యే వ్యక్తులను యాడ్ చేసి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేయొచ్చు.
ఈ ట్విట్టర్ సర్కిల్ లో దాదాపు 150 మంది ఒక గ్రూప్ లో ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త ఫీచర్ ట్విట్టర్ సర్కిల్ ప్రయోగాత్మక దశలో ఉంది.త్వరలోనే దీన్ని ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు.
మీరు వేసే ట్వీట్ కేవలం ఎంచుకున్న వ్యక్తులు మాత్రమే చూసేలా ట్విట్టర్ సర్కిల్ ఉపయోగపడుతుంది.
ఈ ట్విట్టర్ సర్కిల్ ద్వారా ట్రోలర్స్ నుండి కొద్దిమేరకు తప్పించుకునే అవకాశం ఉంటుంది.
ట్విట్టర్ సర్కిల్ లో ఉన్న 150 మందిని ఎడిట్ చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది.
సో ఈ ట్విట్టర్ సర్కిల్ కొంతవరకైనా ట్రోలర్స్ బెడద నుండి తప్పించుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.
ఇన్ స్టాగ్రాం లో క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ లానే ట్విట్టర్ లో ఈ ట్విట్టర్ సర్కిల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
బాలయ్య బోయపాటి మూవీ అఖండ2 రిలీజ్ అప్పుడేనా.. నందమూరి హీరోల టార్గెట్ ఇదే?