కోవిడ్‌తో కకావికలం.. ప్రభుత్వ దవాఖానాలు, గ్రామీణ భారతానికి ట్విట్టర్ ఆపన్నహస్తం

భారత్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న సంగతి తెలిసిందే.రోజుకు మూడున్నర లక్షల కేసులు, 3 వేలకు పైగా మరణాలతో ఇండియా అల్లాడిపోతోంది.

వైరస్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత వేధిస్తోంది.

ఇదే సమయంలో భారత్‌లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ బీ.1617ను ఆందోళనకర వెరియేంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది.

స్థానికంగా, విదేశాల్లో జరుగుతున్న అధ్యయనాలను డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తోంది.ఈ వేరియెంట్ జన్యక్రమాన్ని, మరిన్ని లోతైన వివరాలను తేల్చే పనిలో సంస్థ వుంది.

మాస్క్ ధరించడం, ఇతరులకూ, గుంపులకూ దూరంగా వుండటం వల్ల ముప్పును తగ్గించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

మరోవైపు దయనీయ స్థితిలో వున్న భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తూనే వుంది.

అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్, జర్మనీ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, చైనా తదితర దేశాలతో పాటు కార్పోరేట్‌లు వీలైనంత సాయం చేస్తున్నారు.

ప్రధానంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, పీపీఈ కిట్లు, వైద్య సామాగ్రిని అందజేస్తున్నాయి.

తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సైతం భారత్‌కు బాసటగా నిలిచింది.

దీనిలో భాగంగా రూ.15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.

110 కోట్లు) సాయం ప్రకటించింది.ఈ మేరకు ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు.

క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ ఎన్జీవో సంస్థలకు ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు డోర్సే తెలిపారు.

ఈ మొత్తంతో సేవా ఇంటర్నేషనల్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లను కొనుగోలు చేస్తుంది.కేర్ ఎన్జీవో సంస్థ తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్లకు అండగా నిలవనుంది.

ఇక ఎయిడ్ ఇండియా సంస్థ.రోగులను ఆసుపత్రుల్లో చేర్చి వారి వైద్య ఆరోగ్య ఖర్చులు చెల్లించడం, లాక్‌డౌన్‌తో సంక్షోభంలో వున్న నిరుపేదలను ఆదుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన వంటి చర్యలు చేపట్టనుంది.

"""/"/ కాగా, భారత్‌లో నెలకొన్న పరిస్థితులను చూసి అమెరికాలోని దిగ్గజ టెక్, ఫార్మా కంపెనీలు, స్వచ్ఛంధ సంస్థలు, ఇండియన్ అమెరికన్‌ కమ్యూనిటీలు తమకు తోచిన విధంగా ఆపన్న హస్తం అందిస్తున్న సంగతి తెలిసిందే.

యూఎస్‌లోని 40కి పైగా కార్పొరేట్ సంస్థలన్నీ ఒక టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు దాదాపు 30 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి.

అన్నల కంటే కూడా తమ్ముళ్లె బెటర్ అని అనిపించుకుంటున్న టాలీవుడ్ హీరోలు !