బాబోయ్..ఒక్క పెళ్ళిలో ఇన్ని ట్విస్టులా..? పెళ్లి కూతురి అన్నగా నటించి చివరికి ఆమెనే పెళ్లి చేసుకోవాలని.!
TeluguStop.com
ఓ అమ్మాయిని ప్రేమించాడు, మతాలు అడ్డొస్తాయని భావించి మారు పేరుతో యువతి తల్లిదండ్రులను కలిశాడు.
కానీ పెళ్లికి వారు అంగీకరించలేదు.దీంతో వారికి కొడుకులా మారినట్టు నటించి ఆ యువతికి పెళ్లి చేశాడు.
ఆ తర్వాత తన ప్రియురాలి పెళ్లి పెటాకులు చేసేందుకు స్కెచ్ వేశాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
పోలీసుల కథనం ప్రకారం.
అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన షేక్ సయ్యద్ వలీ (32) డిగ్రీ వరకు చదువుకున్నాడు.
తర్వాత రెండేళ్లు ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు.
ఫార్మా కంపెనీని మోసగించిన కేసులో గతేడాది మార్చిలో అతడిపై కేసు కూడా నమోదైంది.
ఆ ఘటన తర్వాత వలీ తన మకాంను హైదరాబాద్‌కు మార్చాడు.ఎల్బీనగర్‌లో కన్సల్టెన్సీ తెరిచాడు.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆకర్షించాడు.ఈ క్రమంలో ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.
పెళ్లి చేసుకోవడం కోసం మతం అడ్డు రావడంతో రామ్ అద్వైత్ రెడ్డిగా ఆ యువతి తల్లిదండ్రులకు పరిచయం చేసుకున్నాడు.
మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.కానీ అతడి ప్రతిపాదనకు వారు అంగీకరించలేదు.
అంతకు ముందే.హిందువులుగా అమ్మాయిల పేరెంట్స్ దగ్గర నటించాలని వలీ తన తల్లిదండ్రులను వలీ కోరాడు.
కానీ వారు ఒప్పుకోలేదు.!--nextpage
కల్యాణ్ అనే యువకుడితో కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు.
విషయం తెలిసిన వలీ కల్యాణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించడంతో పెళ్లి ఆగిపోయింది.
విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు వలీని హెచ్చరించారు.మళ్లీ అల్వాల్‌కు చెందిన సంతోష్‌తో అమ్మాయికి పెళ్లి కుదిర్చారు.
సంతోష్, కల్యాణ్ ఇద్దరూ దూరపు బంధువులు కావడంతో మరోమారు ఎంటరైన వలీ కల్యాణ్‌కు ఫోన్ చేసి పెళ్లి ఆపించాలని, తమ ప్రేమ విషయాన్ని ఆయనకు చెప్పాలని బెదిరించాడు.
కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో వలీ మరో కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చాడు.
తన ప్రియురాలి ఇంటికెళ్లి.మీకు కొడుకులా అండగా ఉంటానని నమ్మించాడు.
ప్రియురాలికి సోదరుడిలా వరుడి కుటుంబ సభ్యులను నమ్మించి గత ఏడాది నవంబర్లో ఆమెకు పెళ్లి చేశాడు.
కానీ కాపురం చేయడానికి తనకు కొంత గడువు కావాలని ఆమె భర్తను కోరింది.
పెళ్లయిన రోజే వరుడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వివరాలను మేల్ ఎస్కార్ట్ వెబ్‌సైట్‌లో ఉంచాడు.
సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ రోజు రాత్రి ఎస్కార్ట్ వెబ్‌సైట్‌లో నీ పేరుతో ప్రొఫైల్ ఉందంటూ భర్తకు చెప్పింది.
పంచాయితీ పెట్టించి పుట్టింటికి వచ్చేసింది.దీంతో సంతోష్ పోలీసులను ఆశ్రయించగా వలీ లీలలు వెలుగుచూశాయి.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రొఫైల్ అప్‌లోడ్ విషయంలో యువతి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు.
కాగా, ఉద్యోగాల పేరుతో కొందరి నుంచి దాదాపు రూ.4 లక్షలు వసూలు చేసినట్టు మాదాపూర్‌లో కేసు నమోదైనట్టు పోలీసులు వివరించారు.