ఈ కవలల స్పెషాలిటీ ఏంటో తెలుసా?

అందరి పుట్టినప్పుడు ఒంటరిగా పుడితే కొందరు మాత్రమే పుట్టినప్పుడే ఒకటై వస్తారు.వారే కవలలు.

పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కలసిమెలసి ఉండి అసలైన సోదరి సోదరుల బంధం అనుభూతిని పొందుతారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన కవలలు సమరూప కవలలనే పెళ్లాడాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికాకు చెందిన బ్రిటనీ, బ్రయానా డీన్ అనే అక్కాచెల్లెల్లు ఉన్నారు.

అయితే వారు ఇద్దరు సమరూప కవలలు వీరు జోష్, జెరెమీ సాలియర్స్ అనే ఇద్దరు కవలలను పెళ్లి చేసుకున్నారు.

వారు ఇద్దరు ఒకేసారి గర్భం దాల్చారు.అంతే కాదు వారికీ ఇద్దరికీ ఒకేసారి పిల్లలు పుట్టాలని అది కూడా కవలలు పుట్టాలని కోరుకుంటున్నారు.

2018 ఆగస్టులో ఈ రెండు జంటలకు పెళ్లి అవ్వగా అప్పటి నుంచి వారు ఇంటర్నెట్లో సెలబ్రెటీలుగా మారారు.

ఈ జంటలను చుసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.మీరు సేమ్ టూ సేమ్.

మిమ్మల్ని చూస్తుంటే అద్దంలో మీరు చూసుకుంటున్నట్టు ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఇద్దరు ఒకేసారి గర్భం దాల్చడంతో మరోసారి వీళ్లు ఫెమస్ అయిపోయారు.

ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి