షేవింగ్ చేసుకున్న తండ్రిని గుర్తుపట్టని చిన్నారులు.. వారి రియాక్షన్ చూస్తే నవ్వాగదు..
TeluguStop.com
సాధారణంగా చిన్నపిల్లలు ( Children ) మనుషులను గుర్తు పట్టగలుగుతారు.ఒక మనిషిని పదేపదే చూస్తూ ఉంటే వారిని గుర్తు పెట్టుకోగలుగుతారు.
అదే మనిషి లుక్కు మార్చిస్తే వారిని గుర్తుపట్టలేకపోవచ్చు.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇద్దరు ట్విన్ క్లీన్ షేవ్( Clean Shave ) చేసుకున్న తన తండ్రిని గుర్తుపట్టలేకపోయారు.
ఆ ఫన్నీ వీడియోను @TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 51 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ట్విన్ సిస్టర్స్( Twin Sisters ) ఒక బెడ్ పై కూర్చుని ఉండటం మనం గమనించవచ్చు.
వారి ముందు తల, గడ్డం, మీసం అన్ని షేవ్ చేసిన తండ్రి( Dad ) కూర్చోవడం కూడా మనం చూడవచ్చు.
అంతకుముందు దాకా తండ్రిని జుట్టుతో చూసిన ఈ పిల్లలు షేవ్ చేశాక అతను తన తండ్రే అని గుర్తుపట్టలేకపోయారు.
ఎవరో కొత్త మనిషి వచ్చాడని భయపడ్డారు. """/" /
కొంతసేపటికి ఆ సిస్టర్స్ లో ఒక సిస్టర్ ఏడవడం మొదలుపెట్టింది.
దాంతో తండ్రి ఏడవద్దు నా దగ్గరికి రా అని పిలిచాడు.చైతులు కూడా చాచాడు.
అయితే ఇంకొక సిస్టర్ తన సోదరీమణి ముందు చేయి అడ్డుపెట్టి "మరీ వద్దు, వెళ్ళకే" అని ఆపింది.
కొద్దిసేపటికి ఆమె కూడా ఏడవటం మొదలు పెట్టింది. """/" /
ఆ విధంగా ట్విన్ సిస్టర్స్ తండ్రిని గుర్తుపట్టడంలో ఫెయిల్ అయి ఏడ్చేసారు.
ఈ దృశ్యాలను తల్లి ఫోన్ కెమెరాలో బంధించింది.ఈ వీడియో చూసి చాలామంది బాగా నవ్వుకుంటున్నారు.
ఒక సిస్టర్ మరొక సిస్టర్ ని చేయడం చూస్తుంటే చాలా ముచ్చటేసింది అని మరికొందరు అన్నారు.
దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.
ఆర్టిస్టులకు రాజమౌళి కొత్త కండిషన్స్ పెడుతున్నాడా..?