హైదరాబాద్ లో జంట హత్యల కలకలం
TeluguStop.com
హైదరాబాద్ లోని ఉప్పల్ లో జంట హత్యలు కలకలం సృష్టించాయి.తండ్రీ కొడుకులను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.కాగా మృతులు నర్సింహ శర్మ, శ్రీనివాస్ లుగా గుర్తించారు.
దుండగులు తండ్రిని హత్య చేస్తుండగా శ్రీనివాస్ అడ్డుపడటంతో తనని చంపినట్లు తెలుస్తోంది.మృతుడు శ్రీనివాస్ మలేషియాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నట్లు సమాచారం.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.హత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!