ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్.. టీడీపీ కుట్రలో పీవీ రమేశ్..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై( Land Titling Act ) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రజల ఆస్తులను కొట్టేసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై గొప్పలు చెప్పిన టీడీపీ( TDP ) ప్రస్తుతం దుష్ప్రచారం చేస్తుంది.

రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష టీడీపీ డ్రామాలకు తెర తీయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

భూ యజమానులకు రక్షణ కల్పించే విధంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది.

దీన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ను ( CM YS Jagan ) దెబ్బకొట్టాలని అనేక రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

టీడీపీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది.

తాజాగా ఈ చట్టంపై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్( Ex IAS PV Ramesh ) చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

"""/" / ప్రభుత్వం మీద బురద జల్లడమే ధ్యేయంగా.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు బాధితుడిని అని చెబుతూ పీవీ రమేశ్( PV Ramesh ) తెర మీదకు వచ్చారు.

ఈ క్రమంలోనే తన భూమికి సంబంధించిన కొన్ని వివరాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు.

దీంతో ఒక్కసారిగా పీవీ రమేశ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.పీవీ రమేశ్ ఆరోపణల్లో నిజంపై ఆరా తీయగా అది గత మూడేళ్లుగా కోర్టులో నడుస్తున్న కేసు వివరాలు బయటకు వచ్చాయి.

"""/" / వివరాల్లోకి వెళ్తే.పీవీ రమేశ్ తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ ఆవేదన వెళ్లగక్కారు.

అంతలోనే మళ్లీ దాన్ని సరిదిద్దేసి ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలా జరిగింది అంటూ ఇంకో రెండు పదాలు కలిపి మళ్ళీ పోస్ట్ చేసారు.

అయితే పీవీ రమేశ్ మొదటి ట్వీట్ ను టీడీపీ రాజకీయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది.

మళ్లీ పోస్ట్ చేయడంతో.కొందరు దానికి సమాధానంగా అసలు ఆ చట్టం అమల్లోకి రాకపోతే నీకెలా అన్యాయం జరుగుతుంది.

అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే.

కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఉన్న సమస్యమీద పీవీ రమేశ్ అధికారులు వివరణ ఇచ్చారు.

ఆ భూమిలో ఆయనతో బాటు సోదరులకు కూడా భాగం ఉందని, ఈ క్రమంలో భూమి మ్యుటేషన్( Land Mutation ) కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వివరించారని తెలుస్తోంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉండగా.

రమేష్ అవేమి చూపించకుండా దరఖాస్తు చేసారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తహసీల్దార్ తేల్చేసారు.

దీంతో అనవసరంగా టీడీపీ మాయలో పడి.పరువుపొగొట్టున్నారని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

కావాలనే టీడీపీ సానుభూతిపరులు వైసీపీపై అసత్య ప్రచారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం క్లియర్ కట్ గా అర్థం అవుతుందని తెలుస్తోంది.

దీంతో ప్రజల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RC 16 నుంచి తప్పుకున్న రెహమాన్… క్లారిటీ ఇచ్చిన మేకర్స్?