పోలీసుల ముందు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్

టీవీ9 వ్యవహారంలో యాజమాన్యంతో తలెత్తిన వివాదం కారణంగా ఒక్కసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ సీఈఓ రవిప్రకాష్ తాజాగా పోలీసుల ముందుకు వచ్చాడు.

ఇన్నిరోజులు అజ్ఞాతంలో ఉండి తనపై మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసిన రవిప్రకాష్ కు సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది.

ఫోర్జరీ కేసులో రవిప్రకాశ్ మీద టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.

దీనికి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన కూడా అతనికి ఊహించిన విధంగా ఎదురు దెబ్బలు తగిలాయి.

సుప్రీంకోర్టు కూడా అతని అభ్యర్ధనను తోసిపుచ్చి కచ్చితంగా పోలీసుల ముందు హాజరు కావాల్సిందేనని చెప్పింది.

దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో రవి ప్రకాష్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ముందు హాజరయ్యారు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాష్ ఊహించని విధంగా ఒక్కసారిగా పోలీసుల ముందుకు వచ్చి నేరుగా లొంగిపోవడంతో మీడియా వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.

అయితే యాజమాన్యంతో అతను సంప్రదింపులు జరిపిన మీదట లొంగిపోయినట్లు మీడియా వర్గాల్లో మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే రవి ప్రకాష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అంత వరకు ఎదురుచూడాల్సిందే.

వీడియో: బైక్‌పై పిల్లోడు ఉన్నా.. స్టంట్స్ చేశాడు.. మండిపడుతున్న నెటిజన్లు..