వేణు స్వామి, టీవీ5 మూర్తి వివాదంలో ట్విస్టులు ఇవే.. ఏకంగా ఇంత జరిగిందా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా రాజకీయాలలో ఎక్కడ చూసినా కూడా టీవీ5 మూర్తి ( TV5 Murthy )అలాగే వేణు స్వామి( Venu Swamy ) ల వివాదం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.ఈ విషయంలో కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

కాగా టీవీ5 మూర్తి ఇంకా కొందరు జర్నలిస్ట్‌ లు కలిసి తమను రూ.

5 కోట్లు డిమాండ్ ( Rs.5 Crores )చేస్తున్నారంటూ సెలబ్రెటీ అస్ట్రాలజర్ వేణు స్వామి, ఆయన భార్య వీణలు సోషల్‌ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ అయిన ఆ వీడియోలో టీవీ 5 మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంత డబ్బు మా దగ్గర ఎందుకు ఉంటుందని వాళ్లు చేసే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

"""/" / అదే వీడియోలో కాల్‌ రికార్డింగ్‌ ను కూడా జోడించి టీవీ5 మూర్తితో పాటు ఇతర జర్నలిస్టులపై ( Journalists )వారు ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణల మీద టీవీ5 మూర్తి రియాక్ట్ అయ్యాడు.వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ టీవీ లైవ్ షోలో ప్రకటించాడు.

అంతే కాకుండా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి వేణు స్వామి, వీణలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసు ఫిర్యాదు చేశారు.

తాను చేయని నేరాన్ని తనపై ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.తన నిజాయితీని కించపరచడంతో పాటు చిత్తశుద్దిని ప్రశ్నించే విధంగా వారు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

"""/" / అలాగే తాను బ్లాక్‌ మెయిల్‌ కి పాల్పడ్డట్లుగా వారు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే ఏ శిక్షకు అయినా సిద్దం అని, వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మూర్తి డిమాండ్‌ చేస్తున్నాడు.

తాను ఎప్పుడు కూడా ఎవరిని బ్లాక్ మెయిల్‌ చేయలేదని, తనకు ఆ అవసరం లేదని మూర్తి చెప్పుకొచ్చాడు.

గతంలో తాను ఆయన వికృత చేష్టలు, అబద్దపు జోతిష్యాల గురించి బయట పెట్టడం వల్లే ఇప్పుడు తన గురించి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మూర్తి చెప్పుకొచ్చాడు.

మరి ఇందులో నిజాలు తెలియాలి అంటే పోలీసులు ఈ విషయంపై స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. మాధవీలత షాకింగ్ కామెంట్స్ వైరల్!