ప్రతి ఇంటికి టీవీ ఏర్పాటు ప్రశంసనీయం : చేవెళ్ల ఎంపీ

కరోనా నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు దూరమయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామల్లోని ప్రతి ఇంటికి టీవీలను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నాడు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేస్తున్నారని ఆయన కొనియాడారు.

డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు ఉచితంగా టీ-శాట్ ద్వారా విద్యను అందించడం అభినందనీయమన్నారు.

మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని కొనియాడుతూ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీటర్ లో అభినందనలు తెలిపారు.

చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి ట్విట్టర్ లొ మాట్లాడుతూ.‘‘రాష్ట్రంతో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇప్పటికే విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది.పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు చదువుపై అశ్రద్ధ వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్ట పరచడం సంతోషంగా ఉంది.ఈ-గవర్నెన్స్ కోసం గ్రామ సర్పంచ్ లు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవాలి.

విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ విద్యను అందించడం అభినందనీయం.ఉచితంగా టీవీలను అందించడంతో టీ-శాట్ ద్వారా ఆన్ లైన్ తరగతులు వినొచ్చు.

’’ అంటూ ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం వికారాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి టీవీలను అందించడానికి మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి చెక్కు అందజేశారు.

నేటితో ముగియనున్న సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!