వివాహేతర సంబంధం కారణంగా సీరియల్ నటి దారుణ హత్య

ప్రస్తుత కాలంలో కొందరు తమ జీవిత భాగస్వామిపై లేనిపోని అనుమానాలు పెంచుకుంటూ క్షణికావేశానికి లోనై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 తాజాగా టీవీ సీరియళ్లలో నటించేటువంటి ఓ నటి వివాహేతర సంబంధం అనే అనుమానం కారణంగా దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్ర రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో కలకలం రేపింది.

విఅవ్రల్లోకి వెళితే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో అనిత అనే ఓ సీరియల్ నటి తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది.

ఈమె వృత్తి రీత్యా పలు రకాల టీవీ సీరియళ్లలో నటిస్తూ సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

అయితే వృత్తి రీత్యా అనిత పలువురితో సన్నిహితంగా మెలిగేది.దీంతో రవీంద్ర నిత్యం అనితను అనుమానిస్తూ వచ్చేవాడు.

దీంతో ఈ అనుమానం కాస్త తుఫాన్ లాగా చిలికి చిలికి పెద్ద వాన అయినట్లు రోజు రోజుకి ఆమెపై అనుమానాన్ని పెంచుకుంటున్నాడు.

"""/"/ ఈ క్రమంలో  ఆమె హతమార్చాలని తన మిత్రుడితో కలిసి పన్నాగం పన్నాడు.

ఇందులో భాగంగా నటి అనితను ముంబై నగరానికి తీసుకువచ్చి ఆమెకు మత్తు మందు ఇచ్చి ఉరివేసి హతమార్చారు.

అనంతరం మృతదేహాన్ని పెట్రోలు పోసి తగలబెట్టారు.ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే శవం కాలిన వాసనను గమనించిన స్థానికులు దగ్గర ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పోస్టుమార్టం ఆధారంగా మృతురాలి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారు.

ఇందులో భాగంగా నటి భర్త రవీంద్రను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంగా తానే హతమార్చినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

వైరల్ వీడియో: పెళ్లయిన తరువాత మొదటిరోజు మీకు కూడా ఇలాగే జరిగిందా?