టీవీ ప్రసారాలు మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసా!

మన దేశంలో ప్రేక్షకులకు వెండితెర ఎంత వినోదం అందిస్తుందో.బుల్లితెర కూడా అంతకంటే ఎక్కువనే వినోదాన్ని పంచుతూ ప్రతి రోజు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది.

నిజానికి ముందు కంటే ఇప్పుడు టెలివిజన్ రంగం బాగా అభివృద్ధి చెందింది.ఇంతకు ముందు వారానికి ఒక సినిమా, రోజు కనిపించే డైలీ సీరియల్స్ తప్ప టెలివిజన్ లో మరొకటి వచ్చేది కాదు.

కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో టెలివిజన్ రంగం కూడా చాలా ముందుకు వెళ్ళింది.

రోజు కొత్త సినిమాలతో, విభిన్నమైన సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది.

టీవీ ఛానెల్స్ ముఖ్యంగా ఆడవాళ్లకు మంచి వినోదం అందిస్తున్నాయి.ఆడవాళ్లు ఎక్కువుగా చూసే వాటిలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయనే చెప్పాలి.

అయితే ఇప్పుడు అన్ని ఛానెల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మార్చి మార్చి చూస్తుంటాం.

కానీ అప్పట్లో ఒక్క దూరదర్శన్ తప్ప మిగతా ఛానెల్స్ ఉండేవే కాదు.అసలు టీవీ ప్రసారాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో మీకు తెలుసా.

మన దేశంలో టీవీ ప్రసారాలు మొదటిసారి ఎప్పటి నుండి ప్రారంభం అయ్యాయని అడిగితే ఈ ప్రశ్నకు చాలా మందికి ఆన్సర్ తెలియక పోవచ్చు.

"""/"/ మన దేశంలో స్వాతంత్ర్యం రాకముందు నుండే రేడియో ప్రసారాలు అందుబాటులో ఉండేవి.

అలా అప్పటి నుండి రేడియో ద్వారానే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు.1959 నుండి మన దేశంలో టీవీ ప్రసారాలు రావడం స్టార్ట్ అయ్యాయి.

అప్పట్లో రేడియో తోనే టీవీ మాధ్యమం కలిసి ఉండేది.1965 లో దూరదర్శన్ ను ఏర్పాటు చేయడంతో అప్పటి నుండి ప్రతిరోజు రెండు గంటల పాటు ప్రసారాలు ప్రసారం అయ్యాయి.

ఆ తర్వాత రామాయణం, మహాభారతం వంటి ప్రసారాలు ప్రసారం చేయడంతో దూరదర్శన్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రెసెంట్ అన్ని భాషల్లో దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.

వైరల్.. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో పెళ్లి చేసుకున్న వివాహిత మహిళలు