Vaishnavi : కొడుకు కోసం మొదటిసారి అంత బంగారం కొన్న బుల్లితెర నటి.. వీడియో వైరల్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి వైష్ణవి( Actress Vaishnavi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది వైష్ణవి.

స్టార్ మా లో ప్రసారం అవుతున్న దేవత సీరియల్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే గత ఏడాది వైష్ణవి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

బుల్లితెర పై సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గర అయిన వైష్ణవి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

"""/" / సొంతంగా యూట్యూబ్ ఛానల్( YouTube Channel ) పెట్టిన ఆమె ఎంగేజ్మెంట్ నుంచి బాబు పుట్టడం వరకు ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంది.

ఎంగేజ్మెంట్ షాపింగ్,పెళ్లి షాపింగ్, పెళ్లి బట్టలు, మ్యారేజ్ కలెక్షన్స్ అంటూ ఇలా రకరకాల వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త వీడియోలు షేర్ చేస్తూనే వచ్చింది వైష్ణవి.

ఇది ఇలా ఉంటే ఇటీవలె వైష్ణవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

అదే విషయాన్ని వైష్ణవి తమ్ముడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.ఇది ఇలా ఉంటే ఇటీవలే పుట్టిన బాబు కోసం వైష్ణవి తాజాగా బంగారం కొనుగోలు చేసింది.

ఈ నేపథ్యంలోనే షాపింగ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక షాపింగ్ మాల్ లోకి వెళ్లిన ఆమె అక్కడున్న జువెలరీ ఐటమ్స్ అన్ని చూస్తూ తర్వాత బాబుకి కావాల్సినవన్నీ కూడా కొనుక్కుంది.

"""/" / ఈ నేపథ్యంలోనే తన కొడుకు కోసం వైష్ణవి 4 గ్రాముల దిష్టిపూసల దండ జత( Pair Of Beaded Garlands ) తీసుకుంది.

అలాగే 8 గ్రాముల కడెం, 1 గ్రాము ఉంగరం, ఒక చైన్‌, 14 గ్రాముల బ్రేస్‌ లెట్‌ తీసుకుంది.

కొడుకు షాపింగ్ ముగియగానే వెంటనే తన షాపింగ్ ని మొదలు పెట్టేసింది వైష్ణవి.

ఇక వైష్ణవి తో పాటు ఆమె తమ్ముడు కూడా పక్కనే ఉండి షాపింగ్ చేశాడు.

మధ్య మధ్యలో ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ను అందించారు.

కొడుకు కోసం బంగారం కొనడానికి వచ్చిన వైష్ణవి పనిలో పనిగా తాను కూడా బంగారు ఆభరణాలు కొనుక్కుంది.

లక్ష్మీదేవి నెక్లెస్‌, మ్యాచింగ్‌ గాజులు, చెవి కమ్మలు కూడా తీసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోని చూసిన వైష్ణవి అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

వైష్ణవి సురేష్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత ఆమె సీరియల్స్ కి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది.

మరి బాబు కొంచెం పెద్దయిన తర్వాత మళ్లీ బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి మరి.

అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ భార్య.. ఏమైందటే?