రైతుగా మారిన ప్రముఖ నటుడు.. 40 ఎకరాల భూమి, 40 ఆవులతో..?

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో గజగజా వణికించింది.

కరోనా వల్ల దేశంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది.ఎప్పుడూ లాభాలు వచ్చే వ్యాపారాలకు సైతం కరోనా వల్ల నష్టాలు వచ్చాయి.

బాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన అశిష్ శర్మ కరోనా వల్ల రైతుగా మారడం గమనార్హం.

సియా కే రామ్ అనే సీరియల్ లో నటించడం ద్వారా అశిష్ శర్మ ప్రేక్షకుల్లో గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు పాపులారిటీని పెంచుకున్నారు.

అశిష్ శర్మ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు.కరోనా వల్ల అశిష్ శర్మ సొంతూరుకు వెళ్లిపోయారు.

ప్రస్తుతం రైతుగా మారిన అశిష్ శర్మకు సొంతూరిలో 40 ఆవులతో పాటు 40 ఎకరాల భూమి ఉంది.

సొంతూరికి రావడం గురించి అశిష్ శర్మ స్పందిస్తూ తన వ్యవసాయ క్షేత్రంకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

తాను పాలు పితకడం నేర్చుకున్నానని అశిష్ శర్మ వెల్లడించారు.అశిష్ శర్మ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

"""/"/ లైఫ్ లో చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించడం ఎప్పుడో తాను మరిచిపోయానని అశిష్ అన్నారు.

కరోనా వల్ల జీవితంలో ముఖ్యమైనవి ఏంటో తనకు అర్థమవుతుందని అశిష్ వెల్లడించారు.తాను ముంబైలో అడుగుపెట్టిన తరువాత మూలాలకు తాను దూరమయ్యానని అశిష్ పేర్కొన్నారు.

సీరియల్ నటుడిగా వెలుగు వెలిగిన అశిష్ వ్యవసాయంపై ఆసక్తి చూపడం గమనార్హం.కరోనా వల్ల ప్రకృతి విలువతో పాటు ప్రకృతిలో ఉన్న మాధుర్యం తాను తెలుసుకున్నానని అశిష్ చెప్పుకొచ్చారు.

హిందుత్వ అనే ప్రాజెక్ట్ లో ప్రస్తుతం అశిష్ నటిస్తున్నారు.వ్యవసాయం చేయడం ద్వారా అశిష్ తన పాపులారిటీని మరింత పెంచుకోవడం గమనార్హం.

అశిష్ ఫోటోలను చూసి నెటిజన్లు అతనిని తెగ మెచ్చుకుంటున్నారు.

బాలయ్య రామ్ చరణ్ అండ తో శర్వానంద్ హిట్టు కొట్టబోతున్నాడా..?