రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకు ఈ ప్రముఖ సీరియల్ నటి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో బుల్లితెర అలాగే వెండితెర సెలబ్రేటీలు ఒకరి తర్వాత ఒకరు శుభవార్తలు చెబుతూనే ఉన్నారు.
ఇటీవల కాలంలో వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతూ కొందరు శుభవార్త చెబుతుండగా మరికొందరు పెళ్లయిన వారు తల్లిదండ్రులు అవుతూ మరో శుభవార్తను చెబుతున్నారు.
అలా తాజాగా మరో బుల్లితెర నటి ఇప్పుడు అభిమానులకు శుభవార్త తెలిపింది.ఇప్పుడు తెలుసుకోబోయే ఆ నటి మనందరికీ సుపరిచితమే.
ఆమె ఎన్నో సీరియల్స్ నటించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. """/" /
ప్రస్తుతం ఒకవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటూ సీరియల్ షోస్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు అంజలి.ఒకప్పుడు టెలికాస్ట్ అయినా మొగలిరేకులు సీరియల్ నటించి భారీగా గుర్తింపు తెచ్చుకుంది.
మొగలిరేకులు సీరియల్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజలి దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ చేసింది.
వీటితో పాటు మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ నటించింది.అలానే లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈమె 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది.
"""/" /
వీళ్లకు చందమామ అనే కూతురు కూడా ఉంది.కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన అంజలి, తన కూతురితో తీసుకున్న వీడియోలు, మిగతా వాటిని ఎప్పటికప్పుడు పోస్ట్చేస్తూనే ఉంటుంది.
ఇప్పుడు తన భర్తకు ప్రెగ్నెన్సీ విషయమై సర్ ప్రైజ్ ఇచ్చింది.అంతకు ముందు కూతురికి తమ్ముడు కావాలా? చెల్లి కావాలా? అని అడిగిన అంజలి భర్తకు దీని గురించి సర్ ప్రైజ్ ఇచ్చి ఎమోషనల్ చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియోని తన ఛానెల్ లో పోస్ట్ చేసింది.దీంతో ఈమె సహ నటీనటులు విషెస్ చెబుతున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.