నేను చనిపోయాను అంటూ రూమర్స్ వచ్చాయి… కన్నీళ్లు పెట్టుకున్న బుల్లితెర నటి?
TeluguStop.com
సోషల్ మీడియా ( Social Media ) అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రెటీల గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అయితే కొంతమంది మాత్రం ఫేమస్ అవడం కోసం పలువురు సెలబ్రిటీల గురించి ఫేక్ న్యూస్ రాస్తూ ఉండడం మనం చూస్తున్నాము.
కొంతకాలం పాటు వెండితెర పైన బుల్లితెర పైన సెలబ్రిటీలు కనుక కనిపించకపోతే వారు చనిపోయారంటూ వార్తలు రాస్తున్నారు.
ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను సోషల్ మీడియాలో చంపేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్న సమయంలో చివరికి వాళ్లే స్పందించి ఇంకా మేము బ్రతికే ఉన్నాము అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
"""/" /
ఇలా సినిమా సెలబ్రిటీల గురించే కాకుండా బుల్లితెర సెలబ్రిటీల గురించి కూడా ఇలాంటి వార్తలు రావడం గమనార్హం.
బుల్లితెరపై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జాకీ( Jackie ) హరిత( Haritha ) దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అయితే ఈ దంపతులు తాజాగా సుమా అడ్డా( Suma Adda ) కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. """/" /
ఈ ప్రోమోలో భాగంగా హరిత జాకీ దంపతులు మొదటి నుంచి ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.
అయితే చివరిలో జాకీ మాట్లాడుతూ ఒక్కసారిగా అందరిని కంటతడి పెట్టించారు.ఈ సందర్భంగా ఆరు నెలల క్రితం తాను చనిపోయానని( Dead ) కాలుస్తున్నారంటూ వార్తలు రాశారని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
ఇలా జాకీ తన గురించి ఇలాంటి వార్తలు రాసారని చెప్పడంతో తన భార్య హరిత ఎమోషనల్(Haritha Emotional) అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక సుమ( Suma ) సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!