ఢిల్లీ లిక్కర్ కేసులో మలుపు.. అఫ్రూవర్‎గా ఎంపీ మాగుంట..!?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అఫ్రూవర్ గా మారారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కేసుకు సంబంధించి ఈడీ అధికారులకు కీలక సమాచారం అందించారని సమాచారం.

కాగా ఇప్పటికే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్స్ గా మారిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వీరిద్దరి బెయిల్ పై బయట ఉండగా .శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈడీ విచారణ వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నించిన ఈడీ అధికారులు రాబోయే రోజుల్లో మరి కొంతమందిని ప్రశ్నించనున్నారని సమాచారం.

అరుదైన ఘటన.. ఒకేసారి ఆరుగురు సోదరులు, సోదరీమణులు వివాహం