క‌ర్లీ హెయిర్‌ను ఇంట్లోనే ఈ చిట్కాతో స్ట్రైట్‌గా మార్చుకోండి!

స్ట్రైట్ హెయిర్ కోసం చాలా మంది అమ్మాయిలు తెగ ఆరాట పడుతుంటారు.ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెట్టి తమ హెయిర్ ను స్ట్రైట్ గా మార్చుకోవడం కోసం రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు.

కానీ పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే సహజంగా స్ట్రైట్ హెయిర్ ను పొందొచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ చిట్కాను కనుక పాటిస్తే కర్లీ హెయిర్ ని చాలా సులభంగా స్ట్రైట్ గా మార్చుకోవచ్చు.

మరి లేటెందుకు ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ గంజిని పోయాలి.

అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.

ఆపై గంజి దగ్గర పడేంత వరకు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఈ మిశ్రమం పూర్తిగా చల్లారే లోపు.

ఒక అర‌టి పండును తీసుకుని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే ఒక అలోవెర ఆకు నుండి జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

"""/"/ ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న‌ అరటి పండు ముక్కలు, ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని గంజి మిశ్రమంలో వేసి బాగా కలపాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని గంట పాటు వదిలేయాలి.

అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఇలా తరచూ చేస్తుంటే కర్లీ హెయిర్ సహజంగానే స్ట్రైట్ గా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.

పైగా ఈ చిట్కాను పాటించడం వల్ల హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.

నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి