కీళ్ల నొప్పులా..పసుపు టీతో నివారించుకోండిలా!
TeluguStop.com
కీళ్ల నొప్పులు.వయసు పెరిగే కొద్ది ఈ సమస్య ఏర్పడటం సర్వ సాధారణం.
కానీ, ఇటీవల కాలంలో చిన్న వయసు వారు సైతం కీళ్ల నొప్పులను ఎదుర్కొంటున్నారు.
ఆహారపు అలవాట్లు, క్షణం తీరికలేని జీవితం, పోషకాల లోపం, మారిన జీవన శైలి ఇలా రకరకాల కారణాల వల్ల కీళ్ల నొప్పులను ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే చాలా మంది కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు తరచూ పెయిన్ కిల్లర్స్ వాడతారు.
కానీ, న్యాచురల్‌గా కూడా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా పసుపు టీ కీళ్ల నొప్పిలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ముందుగా ఒక గ్లాస్ వాటర్‌లో కొద్దిగా పసుపు వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం వేసి కాచి.
వడబోసుకోవాలి.ఇప్పుడు ఇందులో టేస్ట్‌కు సరిపడా తేనె కలిపుకుంటే సరిపోతుంది.
ఈ పసుపు టీని తీసుకుంటే.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.
"""/" /
ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధ పడే వారు ఈ పసుపు టీని ప్రతి రోజు తీసుకుంటే.
అందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు నొప్పులు తగ్గడానికి గ్రేట్‌గా సహాయపడతాయి.అయితే అతిగా మాత్రం తీసుకోరాదు.
రోజుకు కేవలం ఒక కప్పుడు మాత్రమే ఈ టీని తీసుకోవాలి.ఇక పసుపు టీతో మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ఈ పసుపు టీని రెగ్యులర్‌గా ఉదయాన్నే తీసుకుంటే.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
దాంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే కంటి చూపు తగ్గుతుందని భావించే వారు ప్రతి రోజు ఈ పసుపు టీ తీసుకుంటే.
అందులో ఉండే ప్రత్యేకమైన పోషకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.మరియు కంటి చూపు కూడా పెరుగుతుంది.
ఇక పసుపు టీ తీసుకుంటే.శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?