వైట్ హెయిర్ నుంచి ర‌క్షించే ప‌సుపు.. ఎలా వాడాలంటే?

వైట్ హెయిర్‌.ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మందిని మాన‌సికంగా మ‌ద‌న పెడుతున్న స‌మ‌స్య ఇది.

అయితే జుట్టు తెల్ల‌బ‌డ్డాక క‌ల‌ర్స్‌తో క‌వ‌ర్ చేసుకుంటూ బాధప‌డే బ‌దులు.వైట్ హెయిర్ రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో మేలు.

అందుకు ప‌సుపు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఎన్నో పోష‌కాలతో పాటు మ‌రెన్నో ఔష‌ధ గుణాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా ప‌సుపు బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.అలాగే జుట్టుకు సంర‌క్ష‌ణ‌కు కూడా ప‌సుపు స‌హాయ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ప‌సుపును వాడితే తెల్ల జుట్టు స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ప‌సుపు వేయాలి.

ఆ త‌ర్వాత గ‌రిటెతో తిప్పుకుంటూ ప‌సుపు న‌లుపు రంగులోకి మారే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు రంగు మారిన ప‌సుపులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనె, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసి జుట్టు మొత్తానికి ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో ఒక‌సారి చేస్తే గ‌నుక తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.

ఒకవేళ ఉన్నా క్ర‌మంగా న‌ల్ల‌బ‌డుతుంది. """/" / అలాగే ఒక బౌల్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్ల ప‌సుపు, ఒక పూర్తి ఎగ్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసి రెండు గంట‌లు పాటు వ‌దిలేయాలి.

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.

మ‌రియు జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

వేరే హీరో రిజెక్ట్ చేసిన కథలతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ…