పసుపు ఈ విధంగా వాడితే సూపర్ ఫాస్ట్‌గా బరువు తగ్గొచ్చు.. తెలుసా?
TeluguStop.com
పసుపు.పూర్వ కాలం నుంచి వంటల్లోనూ, ఆయుర్వేదంలోనూ, పూజలోనూ, సౌందర్య సాధనలోనూ ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.
ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండే పసుపు సర్వరోగ నివారిణి అని అనడంలో సందేహమే లేదు.
ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంలోనూ, అనేక జబ్బులు దరి చేరకుండా చేయడంలోనూ పసుపు అద్భుతంగా సహాయపడుతుంది.
ఇక ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి పసుపు దివ్యౌషధంగా పని చేస్తుంది.
అవును, ఇప్పుడు చెప్పే విధాలుగా పసుపును వినియోగిస్తే.సూపర్ ఫాస్ట్‌గా బరువు తగ్గొచ్చు.
ముందుగా.ఒక బౌల్‌లో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి.
అందుల్లో అర స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్న పసుపు, చిన్న ముక్క, మిరియాల పొడి, రెండు నిమ్మచెక్కలు వేసి బాగా మరిగించు కోవాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్‌లో తేనె వేసి.ముందుగా మరిగించుకుని అందులో వడకట్టుకోవాలి.
ఈ వాటర్ గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ డ్రింక్ ఉదయం పూట తాగడం వల్ల.
శరీరరంలో అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గడంతో పాటు వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి.
"""/" /
రెండొవది.ఒక బౌల్‌లో ఒక స్పూన్ స్వచ్ఛమైన పసుపు, అర టీ స్పూన్ వంటకు వాడే కొబ్బరి నూనె మరియు అర స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తీసుకోవాలి.పసుపు, మిరియాలు మరియు కొబ్బరి నూనె మూడు కూడా వెయిట్ లాస్‌కు గ్రేట్‌గా సహాయపడతాయి.
అయితే ఈ మూడింటిని కలిపి తీసుకుంటే.మరింత వేగంగా బరువు తగ్గొచ్చు.
ఇక మూడొవది.ఒక బౌల్‌లో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి.
అందుల్లో ఒక స్పూన్ పసుపు, దాల్చిన చెక్క పొడి, అల్లం ముక్క, మిరియాలు, మరియు రెండు నిమ్మ చెక్కలు వేసేసి బాగా మరిగించాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్‌లో ఈ నీటిని వడకట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత ఈ డ్రింక్‌ను మార్నింగ్ టైమ్‌లో సేవించాలి.
ఇలా చేసినా వేగంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.ఇక మరో విషయం ఏంటంటే.
పైన చెప్పుకున్న మూడు పద్ధతులను ఒకే రోజు చేయరాదు.రోజుకో పద్ధతిని ఎంచుకోవచ్చు.
లేదా ఒక వారం రోజుల పాటు ఒకటి.మరోవారం రోజుల పాటు ఒక పద్ధతిని ఫాలో అవ్వొచ్చు.
అంబుడ్స్‌మన్‌ను తొలగించిన ట్రంప్ .. హెచ్ 1 బీ వీసాదారులు , విద్యార్ధులపై ఎఫెక్ట్