మొటిమలు మచ్చలు తగ్గటానికి పసుపు ఫేస్ పాక్స్
TeluguStop.com
పసుపును సాధారణంగా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం.కానీ పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
పసుపులో క్రిమినాశక లక్షణాలు ఉండుట వలన ఆరోగ్యపరంగా మరియు అందం సంరక్షణలోనూ సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ముఖ్యంగా జిడ్డు చర్మం గల వారిలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.అయితే పసుపును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
పసుపులో క్రిమినాశక కారకాలు మరియు మంటను తగ్గించే లక్షణాలు ఉండుట వలన మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.
ఇప్పుడు పేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి.వాటికీ ఏమి అవసరం అవుతాయో వివరంగా తెలుస్కుందాం.
కావలసిన పదార్ధాలు.శనగపిండి, పసుపు, పెరుగు.
శనగపిండి చర్మంలో మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది.పసుపు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండి బాక్టీరియాను నాశనంచేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తగ్గిస్తుంది. """/"/
ఒక బౌల్ లో శనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల మచ్చలు కూడా మాయం అవుతాయి.
సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించిన పవన్!