పసుపు బోర్డ్ ప్రకటన చేసిన మోదీ.. 12 ఏళ్ల తర్వాత చెప్పులు వేసుకున్న రైతు మనోహర్ రెడ్డి!

చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టమనే సంగతి తెలిసిందే.రోడ్డుపై నడిచే సమయంలో చెప్పులు( Footwear ) లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

అయితే రైతు ముత్యాల మనోహర్ రెడ్డి( Muthyala Manohar Reddy ) గత 12 ఏళ్లుగా చెప్పులు వేసుకోలేదు.

పసుపు బోర్డ్ కోసం కలలు కన్న ముత్యాల మనోహర్ రెడ్డి తన శపథం నెరవేరడంతో తాజాగా చెప్పులు వేసుకున్నారు.

పసుపు బోర్డ్ కోసం గత 12 సంవత్సరాలుగా ఈ రైతు ఉద్యమం చేస్తున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) పసుపు బోర్డ్ కు సంబంధించి ప్రకటన చేయడంతో ఆ రైతు చెప్పులు వేసుకున్నారు.

పాలమూరు వేదికగా ప్రధాని మోదీ పసుపు బోర్డ్ కు సంబంధించి చేసిన ప్రకటన పసుపు రైతులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పసుపు బోర్డ్ కోసం కృషి చేసిన ఎంపీ అరవింద్ కు ( MP Aravind Reddy ) ఆయన ధన్యవాదాలు తెలిపారు.

"""/" / రాబోయే రోజుల్లో పసుపు రైతులకు మరింత ప్రయోజనాలు కలిగేలా చేయాలని ఆయన అన్నారు.

పసుపుకు గిట్టుబాటు ధర లభించడం లేదని పసుపు రైతులు( Turmeric Farmers ) ఎంతో నష్టపోతున్నారని ఆయన కామెంట్లు చేశారు.

చాలా సంవత్సరాల నుంచి రైతుల నుండి ఈ డిమాండ్ ఉండగా పసుపు బోర్డ్( Turmeric Board ) కోసం ఎంతోమంది రైతులు జైలుకు వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి.

రైతుల ఉద్యమాలు వృథా కాలేదని పసుపు రైతులు చెబుతున్నారు. """/" / 2009 సంవత్సరం తర్వాత నుంచి పసుపు బోర్డ్ లక్ష్యంగా ఉద్యమాలు జరిగాయని సమాచారం అందుతోంది.

పసుపు బోర్డ్ కోసం రైతులు పాదయాత్ర చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.ఎంతోమంది రైతుల కష్టం వల్లే పసుపు రైతుల కల నెరవేరిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ముత్యాల మనోహర్ రెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఇక దబిడి దిబిడే.. భారత్ లో కాలుమోపిన HMPV వైరస్