తుంగతుర్తి టికెట్లు మాదిగలకే ఇవ్వాలి: కందుకూరి సోమన్న మాదిగ

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ అన్ని రాజకీయ పార్టీలు 60 వేల పైచిలుకు ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని,కాదని 15 వేల ఓట్లు కూడా లేని మాలలకు కేటాయిస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ కందుకూరి సోమన్న మాదిగ హెచ్చరించారు.

శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన తుంగతుర్తిలో మాదిగల అస్తిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలకు రాజకీయ పార్టీలు తెరలేపాయని,అత్యధిక గలిగిన మాదిగలను పూర్తిగా రాజకీయ అణిచివేతకు గురిచేస్తున్నాయన్నారు.

మాదిగల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్న పార్టీలను ఈసారి ఎన్నికల్లో ఓడించి తీరుతామన్నారు.ఇప్పటికే రెండు దఫాలుగా ప్రధాన రాజకీయ పార్టీలు మాలలకే టికెట్లు కేటాయించి మాదిగలకు తీవ్ర అన్యాయం చేశాయని,ఈ సారైనా నియోజకవర్గ మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు ఆనుగుణంగా మాదిగలకు టిక్కెట్లు కేటాయించి సామాజిక న్యాయాన్ని కాపాడాలని కోరారు.

మాదిగ అభ్యర్ధులను బరిలో నిలిపే రాజకీయ పార్టీకి పూర్తిస్థాయిలో అండగా ఉండి,ప్రత్యక్షమైన పాత్ర పోషించి గెలిపిస్తామని తెలిపారు.

లేనియెడల మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని,మాదిగ మరియు మాదిగ ఉపకులాలను సమీకరించి రాజకీయంగా తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అమృతం తాగేసారా అనేట్టు గా యంగ్ గా కనిపిస్తున్న సీనియర్ హీరోలు