అతని డూప్ వేషం వేసిన పృథ్వీని పిలిచి ఎన్టీఆర్ ఆ మాట అన్నారు.. అది అయన గొప్పతనం?

ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా రాజకీయాన్ని రాజకీయంగానే చూశారని తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు.

అప్పట్లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా, హీరో కృష్ణ ఎంపీగా పోటీ చేశారు.ఇలా కృష్ణంరాజు లాంటి వారు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా వివిధ పార్టీల తరపు నుంచి పోటీ చేశారు.

ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎప్పుడూ కూడా అధికార పక్షం రాజకీయం, రాజకీయంగానే చూశారని ఆయన తెలిపారు సినిమా ఇండస్ట్రీని రాజకీయంలోకి లాగలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే ఎన్టీ రామారావు గారు చాలా క్లియర్‌గా కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు కొంతమంది వచ్చి తాము రాజకీయాల్లో ఉంటామని వచ్చినా దానికి ఆయన చెప్పిన సమాధానాన్ని తుమ్మల ప్రసన్న కుమార్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

వద్దు బ్రదర్.రాజకీయమనేది ఒక రకమైన కంపుతో కూడుకున్న వ్యవహారం.

ప్రజలు ఇంతకాలం ఎంతో చేశారు.దానికి నేను ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ కంపును కడిగేసి, ప్రక్షాళన చేసి ఒక మంచిని చేద్దామనే నేను వచ్చాను.

ఆ దార్లో వెళుతూ నేను కంపులో ఉంటాను.మీరు ఇబ్బంది పడొద్దు.

అని ఎన్టీఆర్ వాళ్లకు చెప్పినట్టు ప్రసన్న కుమార్ తెలిపారు. """/"/ ఒకానొక సమయంలో రామారావు గారికి ఇండస్ట్రీ తరపు నుంచి ఒక సన్మానం ఏర్పాటు చేసినపుడు, మీరు బాగా చేశారు.

కానీ నా సోదరుడు నాగేశ్వర్‌ రావు లేని లోటు నాకు లోటే అని చెప్పడంతో, వెంటనే ఆయన్ని పిలిపించి ఆ కార్యక్రమాన్ని జరిపించారు.

అంటే ఎలాంటి అరమరికలు లేకుండా అక్కడి నుంచి అలా ఎన్టీఆర్ చనిపోయే వరకు కూడా వాళ్లిద్దరూ కలిసే ఉన్నారని ప్రసన్న కుమార్ తెలిపారు.

"""/"/ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడొచ్చు, మరొక సినిమా ఆడకపోవచ్చు.

కానీ ఫ్రొఫెషన్ అనేది వేరని ఆయన అన్నారు.కానీ రిలేషన్ వైస్‌గా అయితే అందరూ మంచిగా ఉండేవారని ఆయన అన్నారు.

అలాగే ఇప్పటివరకు చరిత్ర పుట్టినప్పటినుంచి ఏ ముఖ్యమంత్రి కూడా సినిమా వాళ్లు పొలిటికల్లో ఉన్నా కూడా సినిమాని సినిమాగా, రాజకీయాన్ని రాజకీయంగానే చూశారని ఆయన తెలిపారు.

ఇంకో గొప్ప విశేషమేమిటంటే కమెడియన్ పృథ్వి రాజ్ ఎన్టీఆర్‌ డూప్ వేసి తనను తిడుతూ సినిమాలు తీసినా కూడా, ఆయన పాత్రను పోలిన పాత్రను చేసినా కూడా తెలిసీ, ఒక నటుడిగా బాగా చేశావని పృథ్వి రాజ్ ను పిలిచి పొగిడారే తప్ప నన్ను తిడుతూ సినిమా చేస్తావా అని ఆయన మాట్లాడలేదని ప్రసన్న కుమార్ వివరించారు.

అలాంటి సంస్కారం కలిగిన ఇండస్ట్రీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉండవల్లిలో తెలుగుదేశంపార్టీ 42 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…